LAKSHMI KASULA HARAM REACHES SRINIVASA MANGAPURAM _ వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర 

TIRUPATI, 15 FEBRUARY 2023: The Lakshmi Kasula Haram brought from Tirumala reached Srinivasa Mangapuram on Wednesday.

 

Earlier, the Haram was brought to TTD Administrative Building amidst tight security. Later it was taken to Srinivasa Mangapuram after performing pujas in a grand procession.

 

The Haram will be decorated to Sri Kalyana Venkateswara on the occasion of Garuda Seva on fifth day evening as part of ongoing annual brahmotsavams in Srinivasa Mangapuram. 

 

JEO Sri Veerabrahmam, Special Grade DyEO Smt Varalakshmi, Tirumala temple Peishkar Sri Srihari, AEO Sri Gurumurthy, and other officials were present.

 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర

తిరుపతి, 2023 ఫిబ్రవరి 15: శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ సందర్బంగా బుధవారం తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల‌హారం శోభాయాత్ర వైభవంగా జరిగింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం నుండి నగర వీధుల గుండా శోభాయాత్ర శ్రీనివాసమంగాపురం చేరుకుంది.

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడ సేవను పురస్కరించుకుని బుధవారం రాత్రి ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు.

ముందుగా శ్రీవారి లక్ష్మీకాసులహారంను పేష్కార్ శ్రీ శ్రీహరి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలోని పరిపాలన భవనానికి తీసుకొచ్చారు. అనంతరం లక్ష్మీకాసులహారానికి పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, డెప్యూటీ ఈవోలు శ్రీమతి వరలక్ష్మి,
శ్రీ గోవిందరాజన్, విజివో శ్రీ మనోహర్, ఏఈఓ శ్రీ గురుమూర్తి విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది