SRI KALYANA VENKATESWARA SWAMY ON GARUDA SEVA _ వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడసేవ
Tirupati, 04 March 2024: As part of the ongoing annual Brahmotsavam at Srinivasa Mangapuram, Sri Kalyana Venkateswara Swamy, blessed His devotees on Garuda Vahana Seva on Monday evening.
While the pachyderms, horses and bulls in all their charm were marching in front of the vehicle, groups of devotees were seen performing chekka bhajans and kolatams enthusiastically in front of the vahana seva.
Garuda Vahanam is the most important vehicle among the annual Brahmotsavams. The devotees were thrilled to see the beauty and glory of the deity decked in precious clothes and ornaments besides Lakshmi Kasula Haram and seen chanting Govindaa… Govindaa.. with devotion throughout the procession.
TTD Chairman Sri Bhumana Karunakara Reddy, JEO Sri Veerabraham, CE Sri Nageswara Rao, SE-2 Sri Jagadeeshwar Reddy, Temple Special Officer and CPRO Dr T. Ravi, Special Gr Deputy EO Snt Varalakshmi, VGO Sri Bali Reddy, AEO Sri Gopinath, Vaikhanasa Agama Advisor Sri. Mohana Rangacharyulu, Superintendent Sri Chengalrayulu, Temple Priest Sri Balaji Rangacharyulu, Temple Inspector Sri. Kiran Kumar Reddy also participated.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడసేవ
తిరుపతి, 2024 మార్చి 04: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది.
స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, కేరళ కళాకారులవాయిద్యాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.
వాహనసేవలో టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు, సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఈ -2 శ్రీ జగదీష్ రెడ్డి, ఆలయ ప్రత్యేక అధికారి మరియు సిపిఆర్వో డా.టి.రవి, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, విజివో శ్రీ బాలి రెడ్డి, ఏఈవో శ్రీ గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.