VYAGHRA VAHANAM AT SRI KT _ వ్యాఘ్ర వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి విహారం

Tirupati, 19 Feb. 20: It was a grand Vyagra Vahana seva at Sri Kapileswara Swamy temple on the  sixth day of ongoing annual Brahmotsavams at Tirupati on Wednesday morning.

Bhakti is just like a tiger  as it is symbolic of addressing evils like violence, greed etc. by staunch  devotion to almighty.

Later the utsava idols of Somaskandamurthy and Sri Kamakshi Ammavaru were given a holy bath (snapana thirumanjanam) under supervision of Kankana Bhattar Sri Maniswamy.

DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupathi Raju, AVSO Sri Surendra and others participated. Devotees lined up to witness the Vyaghra Vahana Seva along the streets. 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

వ్యాఘ్ర వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి విహారం

తిరుప‌తి, 2020 ఫిబ్ర‌వ‌రి 19: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీకపిలేశ్వరస్వామివారు వ్యాఘ్ర వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయకనగర్‌ ఎల్‌ టైప్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ ఆలయం, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు ఆకట్టుకున్నాయి.

భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడి హృదయం శివునికి వేదికవుతుందో ఆ జీవుడి  క్రూరపాపకర్మలు, మదమోహ, మాత్సర్యాదులు సంహరింపబడుతాయి.

శాస్త్రోక్తంగా స్న‌ప‌న‌తిరుమంజ‌నం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్ర‌తిరోజూ ఉద‌యం 9 నుండి 11 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం(పవిత్రస్నానం) వైభ‌వంగా జ‌రుగుతోంది. కంకణభట్టార్‌ శ్రీ మ‌ణిస్వామి ఆధ్వర్యంలో ఈ క్ర‌తువు నిర్వ‌హిస్తున్నారు.

 ఈ సంద‌ర్భంగా శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం), ప‌న్నీరు, విభూదితో స్నపనం నిర్వహించారు. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తరువాత  అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను పఠించారు.

గ‌జ వాహ‌నం :

రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు గజవాహనం వైభవంగా జరుగనుంది. ఆద్యంతరహితుడైన శివదేవుని, ఐశ్వర్యసూచికమైన గజవాహనంపై దర్శించడం కోటిజన్మల తపఃఫలం.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తిరాజు, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీ‌నివాస్‌నాయ‌క్ ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు  పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.