RADHA DAMODARA PUJA HELD _ వ‌సంత మండ‌పంలో శ్రీ రాధా దామోద‌ర పూజ‌

Tirumala, 11 Dec. 20: As part of Karthika Masa Deeksha, Radha Damodara Puja was performed in Vasanta Mandapam in Tirumala.

According to Agama Scholar Sri Mohana Rangacharyulu, the Lord commenced his creation only after marrying to Radha Devi.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వ‌సంత మండ‌పంలో శ్రీ రాధా దామోద‌ర పూజ‌

తిరుమల‌, 2020 డిసెంబ‌రు 11: కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా శుక్ర‌‌వారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో శ్రీ రాధా దామోద‌ర పూజ ఘనంగా జరిగింది. ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు, శ్రీ రాధాకృష్ణుల ఉత్స‌వ‌మూర్తుల‌ను వ‌సంత మండ‌పానికి వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ వైకుంఠానికి స‌మీపంలో గ‌ల గోలోకంలో రాధా దేవి పంచ‌శ‌క్తి స్వ‌రూపిణిగా ఉంటుంద‌ని, శ్రీ‌కృష్ణ‌ప‌ర‌మాత్ముడు రాధ‌ను వివాహ‌మాడి సృష్టిని ప్రారంభించార‌ని తెలిపారు. ధాత్రి వృక్షం(ఉసిరి) విష్ణుస్వ‌రూప‌మని, ఈ చెట్టు కింద భ‌గ‌వంతుని ప్రార్థిస్తే కోటి రెట్ల ఫ‌లం క‌లుగుతుంద‌ని చెప్పారు. ఇంత‌టి విశిష్ట‌మైన రాధా దామోద‌ర పూజ వ‌ల్ల వెయ్యి అశ్వ‌మేథ యాగాలు చేసిన ఫ‌లితం ద‌క్కుతుంద‌న్నారు. స్వామి, అమ్మ‌వారి అనుగ్ర‌హంతో వ్యాధిబాధ‌లు తొల‌గుతాయ‌న్నారు.

ముందుగా కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం చేసి ప్రార్థ‌నా సూక్తం, విష్ణుపూజా మంత్ర ప‌ఠ‌నం చేశారు. ఆ త‌రువాత శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి, ధాత్రి వృక్షానికి తిరువారాధ‌న చేశారు. ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.