CHAKRASNANAM OF CHANDRAGIRI SRI KRT _ శాస్త్రోక్తంగా చంద్రగిరి శ్రీ కోదండరాముడి చక్రస్నానం
Tirupati, 30 April 2021: TTD organised grand Avabrutotsavam (chakrasnanam) on Friday morning, the final day of annual Brahmotsavam in ekantham due to Covid-19 guidelines.
Earlier as part of special events of the day TTD archakas performed Vasantothsavam after Temple shuddi and Aradhana. Thereafter they conducted Snapana thirumanjanam for utsava idols of Sri Sitarama Lakshmana along with Chakrathalwar. The celestial event of Chakrasnanam followed amidst the Veda mantra and Mangala vadyam.
Later in the evening the traditional program of Dwajavarohanam was conducted heralding the conclusion of the nine-day festival of Sri Ramanavami Brahmotsavam
On May 1, Saturday, TTD is organising the holy event of Sri Rama Pattabhisekam.
Temple DyEO Sri Subramaniam, Superintendent Sri Kumar, Kankana bhattar Sri Srinivasa Bhattar, Inspector Sri Krishna Chaitanya, other Archakas and staff were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శాస్త్రోక్తంగా చంద్రగిరి శ్రీ కోదండరాముడి చక్రస్నానం
తిరుపతి, 2021 ఏప్రిల్ 30: చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో చక్రస్నానం (అవభృథోత్సవం) జరిగింది. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా చక్రస్నానం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు వసంతోత్సవం నిర్వహించారు. అనంతరం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీ సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకాలు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా ఆలయ ప్రాంగణంలో గంగాళంలో చక్రస్నానం నిర్వహించారు.
అనంతరం సాయంత్రం 6.30 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
కాగా, మే 1వ తేదీ శనివారం సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు శ్రీ రామపట్టాభిషేకం ఏకాంతంగా జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ కుమార్, కంకణబట్టర్ శ్రీ శ్రీనివాస బట్టర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కృష్ణచైతన్య, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.