ANKURARPANA FOR DEVUNI KADAPA AND TIRUCHANOOR PAVITROTSAVAMS HELD _ శాస్త్రోక్తంగా దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల‌కు అంకురార్ప‌ణ‌

TIRUPATI, 17 SEPTEMBER 2021: Ankurarpana for TTD temples at Tiruchanoor and Devuni Kadapa held on Friday evening.

 

As part of the fete Viswaksena Aradhana, Punyahavachanam, Raksha Bandhanam, Mritsangraham, Senadhipathi Utsavam, Ankurarpanam and Pavitra Adhivasam were held in both the temples of Sri Padmavathi Ammavaru at Tiruchanoor and also at Sri Lakshmi Venkateswara Swamy temple at YSR Kadapa district.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శాస్త్రోక్తంగా దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల‌కు అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2021 సెప్టెంబ‌రు 17: వైఎస్‌ఆర్‌ జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప‌విత్రోత్స‌వాల‌కు శుక్ర‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ఫ‌ణ నిర్వ‌హించారు. ఇందుకోసం సాయంత్రం 6 గంట‌ల‌కు విష్వక్సేనపూజ, పుణ్యాహ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, మృత్సంగ్రాహ‌ణం, అంకురార్పణ జ‌రిగింది.

సెప్టెంబరు 18వ తేదీ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చ‌తుష్ఠార్చ‌న‌, యాగశాలపూజ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు నిత్య హోమం నిర్వహిస్తారు. సెప్టెంబరు 19వ తేదీ ఉదయం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 6 గంటలకు పవిత్ర హోమం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 20న ఉదయం 6 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వరకు మహా పూర్ణాహుతి, పవిత్ర వితరణ త‌దిత‌ర కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఆల‌యంలో స్వామి, అమ్మవార్లను ఊరేగించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఏఈవో శ్రీ మురళీధర్ , టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.