DONATES ONE CRORE TO TTD IN A THANKS GIVING GESTURE _ టిటిడికి రూ.కోటి విరాళం అందించిన ఎస్వీ బాలమందిర్ పూర్వ విద్యార్థి శ్రీ పి.విశ్వనాథ్

EMPLOYEE’S SON BECOMES FIRST IITIAN FROM TTD SCHOOL

 

Tirupati, 17 September 2021: In a rare and interesting incident of its kind, Sri Viswanath Poosala, the son of a retired TTD employee and a former student of SV Balamandir School became an inspiration to many students who are pursuing education in TTD-run schools.

 

A peep into the success journey of this lad from Tirupati who is now holding a coveted post in Facebook at the USA really makes not only his family feel proud but also the Institution of TTD which laid him the foundation.

 

Many who pursued education in TTD educational institutions have won global acclaim in their respective professions. One among such personalities is Sri Poosala Viswanath, studied in the TTD-run school of SV Balamandir at Tirupati from 1976-81. Later he pursued his higher education in SV High School from 1981-85 and in SV Junior College from 1985-87.

 

After completing his college, he got into IIT and became the first IITian to be selected from a TTD school. After completing computer science from 1987-91 in IIT Chennai, he did his PhD in Wisconsin, USA between 1992-95. Now, he is holding a coveted post in Facebook at the USA.

 

Sri Poosala Anjaneyulu, father of Sri Viswanath who retired as Deputy Executive Officer in TTD and Sri Suresh Poosala, his elder brother are instrumental in guiding him.

 

The family of Sri. Poosala Anjaneyulu met with EO Dr. K. S. Jawahar Reddy in his chambers in TTD Administrative Building on Friday. On behalf of Sri Poosala Viswanath and his spouse Smt. Dharani, they handed over a cheque of donation for Rs. One Crore to EO and sought him to utilize the same to any of the Trusts run by TTD.

 

TTD EO also appreciated the thanksgiving gesture of Sri Viswanath and his family. He said the success story of Sri Viswanath will be a true inspiration to many students who are pursuing education in TTD Educational institutions.

 

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడికి రూ.కోటి విరాళం అందించిన ఎస్వీ బాలమందిర్ పూర్వ విద్యార్థి శ్రీ పి.విశ్వనాథ్

– అభినందించిన ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి

తిరుపతి 17 సెప్టెంబర్ 2021: తిరుమల తిరుపతి దేవస్థానాలు నిర్వహిస్తున్న
శ్రీ వేంకటేశ్వర బాల మందిర్ లో విద్యనభ్యసించి, ఫేస్ బుక్ సంస్థలో ఉన్నత ఉద్యోగంలో స్థిరపడ్డ శ్రీ విశ్వనాథ్ పూసల, వీరి సతీమణి శ్రీమతి ధరణి శుక్రవారం టిటిడికి కోటి రూపాయల విరాళం అందించారు.

తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డిని శ్రీ విశ్వనాథ్ కుటుంబ సభ్యులు కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందించారు. తిరుపతికి చెందిన టిటిడి రిటైర్డ్ డెప్యూటీ ఈఓ శ్రీ పూసల ఆంజనేయులు కుమారుడు పూసల విశ్వనాథ్ 1976 -81 మధ్య శ్రీ వేంకటేశ్వర బాల మందిరంలో చదువుకున్నారు. 1981-85 వరకు ఎస్వీ హైస్కూల్ లో చదివి పదవ తరగతిలో ఫస్ట్ క్లాసులో పాసయ్యారు. 85 -87 వరకు ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 1987లో చెన్నై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ సీటు సంపాదించిన మొదటి విద్యార్థిగా నిలిచారు. అనంతరం 1992 నుంచి 95 దాకా అమెరికాలోని విస్కాన్సిన్ లో పిహెచ్ డి పూర్తిచేసి ప్రస్తుతం ఫేస్ బుక్ సంస్థలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. వీరి సోదరుడు శ్రీ సురేష్ వీరి ఎదుగుదలకు ఎంతో సహకరించారు.

పూసల విశ్వనాథ్ తనకు విద్యాదానం చేసి తన ఎదుగుదలకు దోహదం చేసిన మాతృసంస్థను మరువకుండా కోటి రూపాయలు విరాళం అందించడమే కాకుండా ఎంతోమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని టిటిడి ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆయనను అభినందించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారి విడుదల చేయడమైనది