ANKURARPANAM HELD _ శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ 

TIRUPATI, 19 MARCH 2023: As the annual brahmotsavams in Sri Kodandarama Swamy temple in Tirupati are set to commence from March 20 onwards, the ritual of prelude, Ankurarpanam was performed on Sunday evening.

Both the senior and junior pontiffs of Tirumala, DyEO Smt Nagaratna, AEO Sri Mohan and other officials were present.

The annual fete will commence with Dhwajarohanam on Monday between 8:45am and 9.32am.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుపతి, 2023 మార్చి 19: మార్చి 20 నుండి 28వ తేదీ వరకు జరుగనున్న తిరుపతి
శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు అభిషేకం, తోమాల సేవ, సహస్రనామార్చన చేశారు. సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు వేదప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి 7.15 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం ఘనంగా జరిగింది. రాత్రి 7.15 నుండి మేదినీపూజ, మృత్సంగ్రహణం, శాస్త్రోక్తంగా అంకురార్పణం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమ‌తి నాగరత్న, ఏఈవో శ్రీ మోహన్, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మేష్‌, ప్ర‌ధాన అర్చ‌కులు శ్రీ ఎపి.ఆనంద‌కుమార్ దీక్షితులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మార్చి 20న ధ్వజారోహణం :

సోమవారం ఉదయం 8.45 నుండి 9.32 గంటల మధ్య ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 7 నుండి 8.45 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.