SRI GT MAHA FETE _ శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు
TIRUPATI, 23 MAY 2023: Vaidika rituals observed in Yagashala on Tuesday as part of ongoing Maha Samprokshanam festivities in Sri Govindaraja Swamy temple at Tirupati.
Both the seers of Tirumala, Trust board member Sri Ashok Kumar, Chief Priest Sri Sri Srinivasa Deekshitulu, DyEO Smt Shanti and other temple staff were present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శాస్త్రోక్తంగా శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు
తిరుపతి, 2023 మే 23: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మహాసంప్రోక్షణలో భాగంగా మంగళవారం శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో హోమగుండాలను వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, కుంభారాధన, పంచగవ్యారాధన నిర్వహించారు. తరువాత విశేష హోమాలు జరిగాయి.
సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఏపి.శ్రీనివాస దీక్షితులు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ శ్రీ రవికుమార్, సూపరింటెండెంట్లు
శ్రీ మోహన్ రావు, శ్రీ నారాయణ, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ ధనంజయులు, శ్రీ రాధాకృష్ణ పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.