శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 24వ తేది నుండి ఏప్రిల్ 1వ తేది వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు
శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 24వ తేది నుండి ఏప్రిల్ 1వ తేది వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి మార్చి-18,2009: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 24వ తేది నుండి ఏప్రిల్ 1వ తేది వరకు తొమ్మిదిరోజులపాటు వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా మార్చి 22వ తేదిన ఆలయంలో కోయిల్ఆళ్వారు తిరుమంజనం, మార్చి 23వ తేదిన ఉదయం 8.40 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. స్వామివారు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళలలో వివిధ వాహనములపై తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు కనువిందైన దర్శనం ఇస్తారు.
అదే విధంగా ఆలయంలో ఏప్రిల్ 3వ తేదిన శ్రీరామనవమి, ఏప్రిల్ 4వ తేదిన శ్రీసీతారామ కల్యాణం, ఏప్రిల్ 5వ తేదిన శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ఏప్రిల్ 7వ తేది నుండి 9వ తేది వరకు మూడురోజులపాటు శ్రీరామచంద్ర పుష్కరిణిలో తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.