శ్రీచెన్నకేశవస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

శ్రీచెన్నకేశవస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, జూలై-2,  2009: తాళ్ళపాకలోనున్న శ్రీచెన్నకేశవస్వామివారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు జూలై 3వ తేది నుండి 11వ తేది వరకు ఘనంగా నిర్వహిస్తారు. అంకురార్పణం జూలై 2వ తేదిన నిర్వహిస్తారు.

తొమ్మిదిరోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు స్వామివారు వివిధ వాహనాలలో ఊరేగుతూ భక్తులకు కనువిందైన దర్శనం ఇస్తారు. అదేవిధంగా తితిదే ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్యప్రాజెక్ట్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, శ్వేతల ఆధ్వర్యంలో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.