KOIL ALWAR TIRUMANJANAM HELD _ శ్రీనివాసమంగాపురంలో వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

TIRUPATI, 07 FEBRUARY 2023: In connection with the annual brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram from February 11-19, the traditional temple cleansing fete, Koil Alwar Tirumanjanam was performed on Tuesday.

 

This religious event took place between 6.30am and 11am where in the entire temple premises and puja utensils were cleaned with a Parimalam mixture and later devotees were allowed for darshan.

 

CURTAINS DONATED:

 

Sri Mani from Tirupati has donated two door curtains for temple corridors on the auspicious occasion along with two kuralams.

 

Special Grade DyEO Smt Varalakshmi, AEO Sri Gurumurthy, Superintendent Sri Chengalrayalu and other temple staff were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీనివాసమంగాపురంలో వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
 
తిరుపతి, 07 ఫిబ్రవరి 2023: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వేడుకగా జరిగింది. ఫిబ్రవరి 11 నుండి 19వ  తేదీ  వరకు ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం తెలిసిందే. 
 
ఉదయం 6.30 నుండి 11 గంటల వరకు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించారు.  ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
 
2 పరదాలు విరాళం
 
ఈ సందర్భంగా తిరుపతికి చెందిన శ్రీ పరదాల మణి రెండు పరదాలు, రెండు కురాళాలను ఆలయానికి విరాళంగా అందజేశారు.
 
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈఓ శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ గురుమూర్తి, ప్రధానార్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ ముని చెంగల్రాయలు, టెంపుల్ ఇన్స్ పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్, ఆర్జితం ఇన్స్ పెక్టర్ శ్రీ ధనశేఖర్ పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.