శ్రీనివాసమంగాపురంలో వార్షిక పుష్పయాగ మహోత్సవం 

శ్రీనివాసమంగాపురంలో వార్షిక పుష్పయాగ మహోత్సవం

తిరుపతి, మార్చి-24, 2011: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వార్షిక పుష్పయాగ మహోత్సవం ఈ నెల 29న నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ఈనెల 28వ తేదిన ఉదయం 9.30 గంటలకు ఆచార్యవరణం, సాయంత్రం 6.00 గంటలకు సేనాధిపతి ఉత్సవం, సాయంత్రం 7.00 గంటలకు అంకురార్పణం, 29వ తేదిన ఉదయం 8.30 గంటలకు హోమం, 10-11.30 గంటల మద్య స్నపన తిరుమంజనం, మధ్యాహ్నాం 2.45 గంటలకు పుష్పయాగం, 8.00 గంటలకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.