శ్రీనివాసమంగాపురంలో శ్రీ సీతారాముల ఊరేగింపు
శ్రీనివాసమంగాపురంలో శ్రీ సీతారాముల ఊరేగింపు
తిరుపతి, 2022 సెప్టెంబరు 20: పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీనివాసమంగాపురంలో మంగళవారం సాయంత్రం శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ శ్రీ ధనశేఖర్ , అర్చకులు శ్రీ శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.