TTD LAUNCHES QR CODE FACILITY FOR TIRUMALA LOCATIONS _ భక్తుల అరచేతిలో తిరుమల మార్గదర్శిని – ఒక చోటి నుంచి మరో చోటికి సులువుగా చేరుకునేలా నూతన ఆవిష్కరణ

TO BE PILOTED ON SRIVARI SEVAKS FOR ENSUING BRAHMOTSAVAMS INITIALLY

 

Tirumala, 20 September 2022:  Hereafter devotees who are thronging Tirumala from different parts of the country, speaking different lingos need not have to struggle to get proper directions, as TTD has come out with yet another pilgrim-friendly initiative.

 

TTD EO Sri AV Dharma Reddy reviewed and did a trial-run of this new QR code facility in his camp office on Tuesday which will be initially piloted on Srivari Sevaks who render free services at different places in Tirumala.

 

Usually, the Srivari Seva volunteers hail from 13 states across the country and especially those coming from Northern and Eastern States feel difficulty in searching the places where they were allotted duty due to the language barrier.

 

However, this new facility will provide an easy way out to reach the required destination with ease. All they have to do is to scan the QR code on their smart phones and get instant directions to over 40 locations in Tirumala including CRO, Additional EO Office, all cottages, rest houses, laddu counters, Vaikuntam queue complex, Vigilance office, hospitals, Museum, Mutts, Mada streets, police station, luggage and mobile storage units and others.

 

The TTD EO lauded the new tech initiative developed jointly by TTD Engineering and PR division which is useful for the devotees to a great extent.

 

The EO also instructed TTD PRO Dr T Ravi to pilot the QR code facility on Srivari Sevaks during the ensuing annual festival which will be of a great help to them to identify and reach their specified service locations to offer services to pilgrims everyday without any confusion and delay. 

                                                                            

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తుల అరచేతిలో తిరుమల మార్గదర్శిని

– ఒక చోటి నుంచి మరో చోటికి సులువుగా చేరుకునేలా నూతన ఆవిష్కరణ

– శ్రీవారి సేవకుల ద్వారా ప్రయోగాత్మకంగా అమలు

తిరుమల 20 సెప్టెంబరు 2022: వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఎవరినీ అడగకుండా ఒక చోటి నుంచి మరో చోటికి సులువుగా చేరుకోవచ్చు. సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి టీటీడీ ఈ నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది.

తిరుమలలో తన కార్యాలయంలో ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి మంగళవారం ఈ విధానాన్ని పరిశీలించారు. తిరుమలలో టీటీడీ కి సంబంధించిన అతిథి గృహాలు, వసతి సముదాయాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, లడ్డూ కౌంటర్లు, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాలు ఇలా భక్తులకు అవసరమైన సుమారు 40 విభాగాల సమాచారాన్ని టీటీడీ
క్యూఆర్ కోడ్ లో నిక్షిప్తం చేస్తుంది. భక్తులు బస్టాండ్ లో దిగి సిఆర్వో, అదనపు ఈవో కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇలా ఎక్కడికి వెళ్లాలనుకున్నా టీటీడీ వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచిన క్యూ ఆర్ కోడ్ ను తమ.మొబైల్ లో స్కాన్ చేస్తే వారికి విభాగాల వారీగా పేర్లు కనిపిస్తాయి. అందులో తాము ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రాంతం మీద క్లిక్ చేస్తే మ్యాప్ డిస్ప్లే అయ్యి నేరుగా అక్కడికి తీసుకుని వెళుతుంది. టీటీడీ ఇంజినీరింగ్, ప్రజా సంబంధాల విభాగాలు తయారు చేసిన ఈ విధానాన్ని ఈవో అభినందించారు. ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. సేవా సదన్ నుంచి వివిధ ప్రాంతాల్లో సేవ చేయడానికి వెళ్ళే శ్రీవారి సేవకులు వారు వెళ్ళాల్సిన ప్రాతం కనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రయోగాత్మకంగా శ్రీవారి సేవకుల ద్వారా ఈ విధానం అమలు అమలు చేయాలని పిఆర్వోను ఈవో కోరారు .

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది