FINISH 3rd PHASE WORKS OF SRINIVASA SETHU ON FAST TRACK – TTD EO _ శ్రీనివాస సేతు మూడవ దశ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : టీటీడీ ఈవో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి
Tirupati, 25 February 2023: TTD EO Sri AV Dharma Reddy urged officials concerned to coordinate with Railway officials and finish the pending works of Srinivasa Sethu like installing of six steel girders on a fast track by April 15.
Addressing a review meeting along with Tirupati Municipal Commissioner Smt Anupama Anjali at TTD Administrative Building on Saturday, TTD EO said 89% of works on Srinivas Sethu were completed and the remaining works to be cleared on a fast pace so as to commission the Sethu by May 15.
Among others, he instructed officials to speed up and complete the pavement works for pedestrians, greenery works at MS Subbulakshmi Circle, other painting works etc.
TTD JEO(H&E) Smt Sada Bhargavi, FA&CAO Sri Balaji, CE Sri Nageswara Rao, TMC SE Sri Mohan and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీనివాస సేతు మూడవ దశ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి : టీటీడీ ఈవో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి
తిరుపతి, 2023 ఫిబ్రవరి 25: శ్రీనివాస సేతు మూడవ దశలో నిర్మాణంలో ఉన్న దాదాపు 6 స్టీల్ గర్డర్ లను రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుని ఏప్రిల్ 15వ తేదీ లోపు అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలో శనివారం తిరుపతి మున్సిపల్ కమిషనర్ కుమారి అనుపమ అంజలితో కలిసి ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, రామానుజ సర్కిల్ నుండి రేణిగుంట వైపు, తిరుచానూరు మార్కెటింగ్ యార్డ్ వరకు ఉన్న శ్రీనివాస సేతు పనులను మార్చి 15వ తేదీ లోపు పూర్తి చేయాలన్నారు.
శ్రీనివాస సేతు పనులు ఇప్పటికే 89 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా మే 15వ తేదీ లోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
అదేవిధంగా పాదాచారులు నడిచేందుకు అనువుగా పేవ్ మెంట్ , కాలువలను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు. సుబ్బలక్ష్మి సర్కిల్ వద్ద పచ్చదనం పెంపొందించాలని, అవసరమైన చోట్ల పెయింటింగు, తదితర పనులపై ఈవో సమీక్షించారు.
ఈ సమావేశంలో జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ఎ అండ్ సీ ఏవో శ్రీ బాలాజీ, సిఇ శ్రీ నాగేశ్వరరావు, మున్సిపల్ ఎస్ఇ శ్రీ మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.