CHIEF PONTIFF OF SRI RANGAM SRIMATH ANDAVAN ASHRAMAM OFFERED PRAYERS TO LORD VENKATESWARA _ శ్రీరంగం శ్రీమద్‌ ఆండవన్‌ ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వ‌రాహ‌ మహాదేశికన్‌ స్వామీజీకి పెద్దమర్యాద

శ్రీరంగం శ్రీమద్‌ ఆండవన్‌ ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వ‌రాహ‌ మహాదేశికన్‌ స్వామీజీకి పెద్దమర్యాద

తిరుమల, 2021 మార్చి 07: తమిళనాడులోని శ్రీరంగం శ్రీమద్‌ ఆండవన్‌ ఆశ్రమం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ వ‌రాహ‌ మహాదేశికన్ (ఆండవన్‌) స్వామీజీకి టిటిడి శ్రీవారి ఆలయం తరపున ఆది‌వారం ఉదయం పెద్ద మర్యాద చేశారు.

ముందుగా పాత అన్నప్ర‌సాద భ‌వ‌నం వ‌ద్ద‌ గల రావిచెట్టు వద్దకు స్వామీజీ చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, అధికారులు ఇస్తికఫాల్‌ స్వాగతం పలికి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి దర్శనం చేయించారు. అక్కడ శఠారి సమర్పించి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయం వ‌ద్ద‌కు చేరుకున్నారు.

శ్రీవారి ఆలయం వద్ద స్వామీజీకి టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి‌, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందచేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్‌, విజివో శ్రీ బాలిరెడ్డి‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala, 7 Mar. 21: His Holiness Sri Sri Varaha Mahadesikan (Andavan), Chief Pontiff of Srirangam Srimath Andavan Ashramam offered prayers in Tirumala temple on Sunday.

He was received at the Sacred Fig tree located near Old Annaprasadam Complex as per temple traditional honours (Pedda Maryada). Later Additional EO Sri AV Dharma Reddy welcomed the seer, while the archakas took the Pontiff to Bedi Anjaneya Swamy temple with Isthikapal honours.

DyEO Sri Haridranath, VGO Sri Bal Reddy, Parpatheyadar Sri Gurappa and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI