CONSTRUCTION OF 111 TEMPLES UNDER SRIVANI IN SECOND PHASE- TTD EO _ శ్రీ‌వాణి ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో రెండో ద‌శ‌లో 111 ఆల‌యాల నిర్మాణం : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

TIRUPATI, 03 SEPTEMBER 2022: As part of spreading the Hindu Santana Dharma in remote areas across the state of Andhra Pradesh and to avoid religious conversions in the backward areas, TTD along with Samarasata Seva Foundation will be constructing 111 temples with SRIVANI funds in the second phase, said TTD EO Sri AV Dharma Reddy.

A review meeting was held by the EO in his chambers in TTD Administrative Building in Tirupati on Saturday on SRIVANI Trust.

During the meeting, he directed the officials concerned to take up the construction of 111 temples across all 26 districts with a concrete action plan and complete it within a specified schedule. He said, TTD has decided to construct 1342 temples under SRIVANI Trust funds and in the first phase 502 temples were completed.

In the second phase, among the selected villages in SC, ST, BC and fishermen colonies, construction of temples is going to happen with Rs.10lakhs which includes 09 Srivari temples, 77 Sri Rama temples, 02 Hanuman temples, 03 Lord Shiva temples, 20 temples dedicated to Folk Goddesses.

Adding further he said, it has been decided to construct 1342 temples under the funds of SRIVANI Trust within two years and a review meeting on the progress of these works will be held once in every two months, he maintained.

He later directed the officials concerned to provide Puja materials to all these temples and give training to the Archakas who are going to be appointed in these temples in SVETA on Nitya Puja Vidhanam. JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, FACAO Sri Balaji, CE Sri Nageswara Rao, Sarmarasata Seva Foundation Chairman Sri Vishnu, Secretaries Sri Trinth, Sri Sunil and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వాణి ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో రెండో ద‌శ‌లో 111 ఆల‌యాల నిర్మాణం : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుపతి, 2022 సెప్టెంబ‌రు 03: స‌నాత‌న ధ‌ర్మ వ్యాప్తిలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మ‌త్స్య‌కార ప్రాంతాల్లో మ‌త మార్పిడుల‌ను అరిక‌ట్టేందుకు శ్రీ‌వాణి ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో స‌మ‌ర‌స‌త సేవా ఫౌండేష‌న్ స‌హ‌కారంతో రెండో ద‌శలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 111 ఆల‌యాల నిర్మాణం చేప‌ట్టాల‌ని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుప‌తిలోని ప‌రిపాల‌న భ‌వ‌నంలో గ‌ల ఈవో కార్యాల‌యంలో శ‌నివారం శ్రీ‌వాణి ట్ర‌స్టుపై స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ శ్రీ‌వాణి ట్ర‌స్టు నిధుల‌తో రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం 1342 ఆల‌యాల నిర్మాణం చేప‌ట్టాలని నిర్ణ‌యించామ‌ని, మొదటి ద‌శ‌లో 502 ఆల‌యాల నిర్మాణం జ‌రిగింద‌ని తెలిపారు. రెండో ద‌శ‌లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మ‌త్స్య‌కార ప్రాంతాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో రూ.10 ల‌క్ష‌ల వ్య‌యంతో ఆల‌యాల నిర్మాణం జ‌రుగ‌నుంద‌న్నారు. వీటిలో శ్రీ‌వారి ఆల‌యాలు -9, రామాల‌యాలు -77, హ‌నుమంతుని ఆల‌యాలు -2, శివాల‌యాలు – 3, గ్రామ‌దేవ‌త‌ల ఆల‌యాలు – 20 ఉన్నాయ‌ని వివ‌రించారు. మొత్తం 1342 ఆల‌యాల నిర్మాణం రెండేళ్ల‌లో పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని, ప్ర‌తి రెండు నెల‌లకోసారి ఆల‌యాల నిర్మాణంపై స‌మీక్ష నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. నిర్మాణం పూర్త‌యిన 502 ఆల‌యాలకు, నిర్మాణం జ‌రుగ‌నున్న 111 ఆల‌యాల‌కు భ‌జ‌న సామ‌గ్రి అందించేందుకు ప్ర‌ణాళిక రూపొందించాల‌ని హిందూ ధ‌ర్మప్ర‌చార ప‌రిష‌త్ అధికారుల‌ను ఆదేశించారు. ఈ ఆల‌యాల్లో అర్చ‌కులుగా నియ‌మించే వారికి శ్వేత ఆధ్వ‌ర్యంలో నిత్య‌పూజా విధానంపై శిక్ష‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌న్నారు.

ఈ స‌మీక్ష‌లో టిటిడి జెఈవోలు శ్రీమ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, సమరసత సేవా ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ తాళ్లూరు విష్ణు, సెక్ర‌ట‌రీ శ్రీ త్రినాథ్‌, జాయింట్ సెక్ర‌ట‌రీ శ్రీ సునీల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.