శ్రీవారికి చిత్రహారతి 

శ్రీవారికి చిత్రహారతి

తిరుపతి, ఏప్రిల్‌-10, 2009: శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్‌ 11,12వ తేదిలలో సాయంత్రం 6 గంటలకు స్థానిక మహతి ఆడిటోరియంనందు ఎస్‌.వి.రంగారావు, తదితరులు నటించిన  ”యశోదకృష్ణ” చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తారు.

కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరడమైనది.

నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్‌.కోటేశ్వరరావు అను భక్తుడు తితిదేకి చెందిన కాటేజి డొనేషన్‌ స్కీమ్‌నకు 10లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చిన్నారు. ఈ డి.డిని ఆయన తి.తి.దే. ఇ.ఓ గారికి శుక్రవారం అందజేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.