SRIVARI ARJITA SEVA TICKETS SCHEDULE _ శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల
TIRUMALA, 17 MAY 2023: For the convenience of the pilgrims, TTD has released the Arjitha Seva tickets schedule. Henceforth all the online services for Seva, Darshan, Accommodation will be released three months in advance, that is tickets will be released every month for the third month. The details of the release dates as follows:
Dip Registration for Arjitha Sevas Viz.Suprabhatam, Tomala, Archana and Astadala Pada Padmaradhana will be available every month from 18 to 20. If the ticket gets confirmed to the pilgrim in the lucky dip the payment interface will be enabled from 20-22 every month.
Arjita sevas like Kalyanotsavam, Arjita Brahmotsavam, Unjal Seva and Sahasra Deepalankara Sevas will be available for booking on first come first serve basis online on 21st of every month along with Virtual Sevas.
SRIVANI, Angapradakshinam, Senior Citizens and Physically Challenged darshan quota will be released on 23rd of every month while Rs.300 Special Entry Darshan on 24th of every month.
The online Accommodation quota for Tirupati will be released on 25th while that of Tirumala on 26th of every month.
If any seva or darshan dates falls on Sundays, then that particular service will be postponed to the next day and all other services also moves to the succeeding date.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల
తిరుమల, 2023 మే 17: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను బుక్ చేసుకునే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టిటిడి షెడ్యూల్ విడుదల చేసింది. సేవా టికెట్లు లేదా దర్శన టికెట్ల విడుదల తేదీ ఆదివారం వచ్చినట్లయితే వాటిని మరుసటి రోజు విడుదల చేస్తారు.
ప్రతినెలా 18 నుంచి 20వ తేదీ వరకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. 20 నుంచి 22వ తేదీ వరకు డిప్ లో టికెట్లు పొందిన వాళ్లు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవలతోపాటు వర్చువల్ సేవాటికెట్లను 21వ తేదీన విడుదల చేస్తారు.
శ్రీవాణి, ఆంగ ప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లు 23వ తేదీన విడుదలవుతాయి.
అదేవిధంగా రూ.300/- దర్శన టికెట్ల కోటాను 24న, తిరుపతిలో గదుల కోటాను 25న, తిరుమలలో గదుల కోటాను 26న విడుదల చేయడం జరుగుతుంది.
భక్తులు ఈ విషయాలను గమనించి సేవా టికెట్లు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.