శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల, 29 సెప్టెంబరు 2013 : అక్టోబర్ 5వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అక్టోబర్ 1వ తారీఖు మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని తి.తి.దే అత్యంత వైభవంగా నిర్వహించనుంది.
సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
మంగళవారంనాడు ఉ. 6 గం||ల నుండి ఉ. 10.00 గం||ల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ తిరుమంజన ఉత్సవాన్ని పురస్కరించుకొని తి.తి.దే అష్టదళ పాదపద్మారాధన సేవను రద్దు చేసింది. ఇతర ఆర్జిత సేవలు యధాతథంగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని ఒక మహాయజ్ఞంలా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని పవిత్రంగా నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.