సెప్టంబర్‌ 30న ప్రయోగాత్మకంగా స్వర్ణ రథం ఊరేగింపు

సెప్టంబర్‌ 30న ప్రయోగాత్మకంగా స్వర్ణ రథం ఊరేగింపు

తిరుమల, 29 సెప్టెంబరు 2013: అక్టోబర్‌ 5వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో సాధారణంగా బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజు నిర్వహించే స్వర్ణ రథం ఊరేగింపును పురస్కరించుకొని సెప్టంబర్‌ 30 సోమవారంనాడు ప్రయోగాత్మకంగా తి.తి.దే నూతన స్వర్ణరథాన్ని ఊరేగించనుంది.

ఆగష్టు నెల 26వ తారీఖున ప్రారంభమైన నూతన స్వర్ణరథం బంగారు తాపడం పనులు ఈ నెల 27వ తారీఖున తుది మెరుగులు దిద్దుకున్నది. దాదాపు 32 అడుగుల ఎత్తుగల ఈ స్వర్ణరథం దేశంలోనే అతిపెద్దది కావడం విశేషం. తమిళనాడుకు చెందిన 15 మంది స్వర్ణకారులు రేయింబవళ్ళు శ్రమించి నూతన స్వర్ణరథాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు.
ఈ స్వర్ణరథాన్ని సోమవారం ఉదయం 9.05 నిమిషాలకు శ్రీ వేంకటేశ్వర పురాతన వస్తు ప్రదర్శనశాల నుండి పడమర, ఉత్తర, తూర్పు మాడవీధుల మీదుగా ఊరేగించి నూతనంగా నిర్మించిన స్వర్ణరథ మండపంలోనికి శాస్త్రోక్తంగా, అత్యంత భారీ భద్రత నడుమ తి.తి.దే తీసుకెళ్ళనుంది.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.