PAVITROTSAVAMS COMMENCES IN SRI TT _ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
TIRUMALA, 08 AUGUST 2022: The annual Pavitrotsavams commenced on a grand religious note in Tirumala temple on Monday.
In the morning, Snapana Tirumanjanam was performed to the processional deities of Sri Malayappa, Sri Devi and Bhu Devi.
Later Pavitra Pratistha was performed followed night Vaidika programs will be performed in Yagashala.
TTD has cancelled Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam and Sahasra Deepalankara Seva on the occasion.
Both the Senior and Junior Pontiffs of Tirumala, TTD EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
తిరుమల, 2022 ఆగస్టు 08: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని సంపంగి ప్రకారంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 4 గంటలకు స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేస్తారు.
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆభరణాలతో సళ్లింపు నిర్వహిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి. పవిత్రోత్సవాల కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలు రద్దయ్యాయి.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, విజివో శ్రీ బాల్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.