SERVE DEVOTEES AT AMARAVATI MS FESTIVITIES WITH DEDICATION- TTD PRO T RAVI _ శ్రీవారి ఆలయం మహాసంప్రోక్షణ లో భక్తి, శ్రద్ధతో సేవలందించాలి
Vijayawada, 4 Jun. 22: TTD Public Relations officer Dr T Ravi has appealed to Srivari Sevakulu to serve devotees with Bhakti, patience and dedication at the Maha Samprokshana celebrations slated between June 4-9 at the newly built Sri Venkateshwara temple in Venkatapalem, Amaravati.
Addressing coordinators of Srivari Sevakulu from Vijayawada, Guntur, Tenali, Machilipatnam Mangalagiri Chirala and Venkatapuram at the TTD Kalyana mandapam Vijayawada on Saturday evening Dr Ravi said thousands of devotees were expected to participate in the six-day fete from June 4-9.
He urged the Srivari Sevakulu to serve drinking water, Anna Prasadam, queue maintenance etc. with patience.
Speaking on the occasion DyEO Sri Gunabhushana Reddy said service to devotees was service to Sri Venkateshwara.
Later TTD PRO, DyEO and coordinators of Srivari Sevakulu inspected the queue lines, pravachana Vedika, Anna Prasadam counters at the Amaravati temple where PRO made valuable suggestions.
TTD Archakas, TTD OSDs Sri Sridhar, Sri Nagesh and kalyana mandapam manager Smt Shobha Rani were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆలయం మహాసంప్రోక్షణ లో భక్తి, శ్రద్ధతో సేవలందించాలి
– శ్రీవారి సేవ టీమ్ లీడర్లకు టీటీడీ పిఆర్వో డాక్టర్ రవి పిలుపు
విజయవాడ 4 జూన్ 2022: వెంకటపాలెం లో జూన్ 4 వ తేదీ నుంచి ప్రారంభమయ్యే శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమంలో భక్తి, శ్రద్ధ, ఓపికతో సేవలు అందించాలని టీటీడీ ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ టి రవి శ్రీవారి సేవకులకు పిలుపునిచ్చారు.
విజయవాడలోని టీటీడీ కళ్యాణ మండపంలో శనివారం విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం, మంగళగిరి, చీరాల, వెంకటాపురం పరిసర ప్రాంతాలకు చెందిన శ్రీవారి సేవ బృందాల సమన్వయ కర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ, జూన్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. 9వ తేదీ వేలాది మంది భక్తులు తరలి వస్తారని ఆయన తెలిపారు. వీరందరికీ ఇబ్బంది కలగకుండా తాగునీరు, ఆహారం అందించడం, క్యూ లైన్ల నిర్వహణ లాంటి సేవలు అందించాల్సి ఉంటుందని చెప్పారు.
డిప్యూటీ ఈవో శ్రీ గుణ భూషణ్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులు సాక్షాత్తూ స్వామివారికి సేవ చేసినట్లేనన్నారు. అనంతరం వీరు శ్రీవారి ఆలయంలో
క్యూల నిర్వహణ, ప్రవచన వేదిక, అన్న ప్రసాదాల పంపిణీ కౌంటర్లు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అర్చకులు, టీటీడీ ఓఎస్డీ లు శ్రీ శ్రీధర్, శ్రీ నగేష్, కళ్యాణ మండపం మేనేజర్ శ్రీమతి శోభారాణి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల సీజయడమైనది.