SSD OFFLINE TOKENS SOON- SV TEMPLES IN TAMILNADU _ శ్రీవారి ఆలయాలతో తమిళనాడు సుసంపన్నం
SRI PADMAVATI TEMPLE KUMBHABHISEKAM AT CHENNAI IN OCTOBER- TTD CHAIRMAN
Tirupati, 06 February 2022: TTD Chairman Sri YV Subba Reddy said that soon TTD will take up the construction of Sri Venkateswara Swamy temples in Tamilnadu and Puducherry region and spread devotional flavour in the South.
TTD Chairman served pledge of office to the newly appointed members of Srivari temple local advisory committee of Tamilnadu at the TTD information Center in Chennai on Sunday.
Speaking on the occasion the Chairman said SV temples will be taken up in two years at the sites allocated by Tamilnadu Government in Madurai, Chennai ECR, Ullandurpeta besides the Union Territory of Puducherry.
He said works Srivari temple at Jammu is under progress on a fast pace. The Kumbhabhisekam of Sri Padmavati temple which is nearing completion in Chennai will be held in October, he added.
Among others, he said construction of two of four shelters for Tamilnadu foot walking devotees are briskly underway at Uttukota and Sitamjeri.
The Chairman of Local Advisory Committee Sri AJ Sekhar said TTD Kalyana Mandapam will be got up at Royapettah in Chennai and Srivari Kalyana Mahotsavam will be grandly celebrated at Kanyakumari and Chennai this year.
Excepting two members K Ananda Kumar Reddy and Sri SS Sudanthiram rest of the members of the Local advisory committee of Chennai were served oath of office by the TTD Chairman.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీవారి ఆలయాలతో తమిళనాడు సుసంపన్నం
చెన్నై, మధురై, ఊలందూరు పేట, పాండిచ్చేరిలో నూతన ఆలయాలు
అక్టోబరులో చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ కుంభాభిషేకం
తిరుమలలో త్వరలో శ్రీవారి సర్వదర్శనం
– టిటిడి చైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి వెల్లడి
తిరుపతి 2022 ఫిబ్రవరి 06: శ్రీవారి ఆలయాల నిర్మాణంతో తమిళనాడు, పాండిచ్చేరి ప్రాంతాలు ఆధ్యాత్మిక పరిమళాలతో సుసంపన్నం కానున్నాయని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. చెన్నైలోని టిటిడి సమాచార కేంద్రం, శ్రీవారి ఆలయానికి నూతనంగా స్థానిక సలహా మండలి సభ్యులుగా నియమితులైన వారి చేత ఆదివారం ఛైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ చెన్నై ఈసిఆర్ లో తమిళనాడు ప్రభుత్వం మంజూరు చేసిన రెండు స్థలాల్లో ఈ ఏడాది ఆఖరులోగా ఒక దాన్ని ఎంపిక చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మధురైలో సిద్ధంగా ఉన్న రెండు ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మాణం కానుందని తెలిపారు. ఊలందూరు పేటలో ఆలయ నిర్మాణం కోసం టెండర్లు ఖరారైనట్టు వివరించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో కూడా శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని వెల్లడించారు. చెన్నై టీ నగర్ లో ఇప్పటికే ప్రసిద్ధి చెందిన శ్రీవారి ఆలయాన్ని మరింత విస్తరించి భక్తుల సౌకర్యాలను మరింత పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. జమ్ములో 66 ఎకరాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలియజేశారు. చెన్నై జిఎన్ చెట్టి రోడ్డులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, అక్టోబర్లో కుంభాభిషేకం నిర్వహించి ఆలయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. తమిళనాడు నుంచి కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మార్గమధ్యంలో నాలుగు ప్రాంతాల్లో విశ్రాంతి గదులు నిర్మించాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా ఊత్తుకోట, సితమంజేరిలో పనులు జరుగుతున్నాయని తెలియజేశారు.
కోవిడ్ వల్ల ఏర్పడిన అవరోధాల దృష్ట్యా నిలిపివేసిన సర్వదర్శనాన్ని తిరిగి ప్రారంభించి పూర్వవైభవ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉన్నవారిని సర్వదర్శనానికి అనుమతిస్తామని చెప్పారు.
పేదలకు అందుబాటులో కళ్యాణమండపం : శ్రీ ఎజె.శేఖర్
చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ ఎజె.శేఖర్ మాట్లాడుతూ పేదలకు అందుబాటులో ఉండేలా చెన్నై రాయపేటలోని టిటిడి స్థలంలో కల్యాణమండపాన్ని త్వరలో నిర్మిస్తామన్నారు. చెన్నై, కన్యాకుమారి ప్రాంతాల్లో ఈ ఏడాది శ్రీవారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ మహోత్సవాలకు ముఖ్యమంత్రి శ్రీ స్టాలిన్ ను ఆహ్వానించి తేదీలు ఖరారు చేస్తామన్నారు. ఎన్ని ఆలయాలు వచ్చినా భక్తుల మనోభావాలకు అనుగుణంగా చెన్నై టి.నగర్ లోని శ్రీవారి ఆలయాన్ని కొనసాగించి, మరింత విస్తరిస్తామని తెలిపారు.
సభ్యుల ప్రమాణ స్వీకారం
స్థానిక సలహా మండలి నూతన సభ్యుల్లో ఇద్దరు మినహా మిగిలిన వారందరూ టిటిడి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యక్షులుగా శ్రీ వేలూరు లక్ష్మణ్ వెంకట సుబ్రమణియన్, శ్రీ ఎం.ప్రభాకర్ రెడ్డి, శ్రీ డి.కదిర్ ఆనంద్, సభ్యులుగా శ్రీ పివిఆర్.కృష్ణారావు, శ్రీ జిఎ.పృథ్వీ, శ్రీ విఆర్.వెంకటాచలం, శ్రీ మోహన్ పద్మనాభరావు, శ్రీ యస్. కార్తికేయన్, శ్రీ కెఎస్.జయరామన్, శ్రీమతి ఇందిరా రాజేంద్రన్, శ్రీ సన్నారెడ్డి రవీంద్రబాబు, శ్రీ కృష్ణారెడ్డి, శ్రీ ఎం.అశోక్ కిషన్, శ్రీ వేమిరెడ్డి సందీప్ రెడ్డి, శ్రీ మారు శ్రీశరణ్, శ్రీ ఎన్.కళ్యాణ్ చక్రవర్తి, శ్రీ పి.ధీరజ్ రెడ్డి, శ్రీ నరేష్ సుబ్రమణి, శ్రీ శన్భగమూర్తి, శ్రీ తాతినేని అజయ్, శ్రీ పన్నీర్ సెల్వం, శ్రీ పరశురాం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ కె.ఆనంద్ కుమార్ రెడ్డి, శ్రీ ఎస్ఎస్.సుదంతిరం అనివార్య కారణాల వల్ల ప్రమాణస్వీకారానికి హాజరు కాలేకపోయారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.