శ్రీవారి నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.5 లక్షలు విరాళం 

శ్రీవారి నిత్యాన్నదానం ట్రస్టుకు రూ.5 లక్షలు విరాళం

తిరుపతి, జనవరి 25, 2013: శ్రీవారి నిత్యాన్నదానం ట్రస్టుకు శుక్రవారం రూ.5 లక్షలు విరాళంగా అందింది. బెంగళూరుకు చెందిన ఆర్‌.దినేష్‌ తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో గల అన్నదానం ట్రస్టు కార్యాలయంలో ఈ మేరకు డిడిని అందజేశారు. ఈ మొత్తాన్ని తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందజేసేందుకు ఉపయోగించాలని దాత కోరారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.