TTD JEO(E &H) LAUDS SRIVARI SEVAK FROM LONDON _ శ్రీవారి సేవకు లండన్ నుండి…- అభినందించిన జెఈఓ శ్రీమతి సదా భార్గవి 

Tirumala, 22 October 2022: Not only devotees from across India but also from overseas are making a beeline to offer services to the fellow pilgrims through Srivari Seva.

Smt Neetu a Srivari devotee hailing from Kerala and a resident of London is the latest addition to the band of Srivari Sevaks who have been rendering impeccable services to the multitude of visiting pilgrims.

Along with her 12 other family members from Kerala, Smt Neetu came for Srivari Seva booking in online for Srivari Seva. A senior official at a corporate company in London, Smt Neetu has rendered services at Anna Prasadam Complex serving food to devotees, cutting vegetables, organising queue lines at Kalyana Katta and as well selling Agarbattis at counters. On Saturday she participated in the cashew nut splitting Seva.

During her maiden inspection to the Cashew Split Seva in Seva Sadan 2 at Tirumala, TTD JEO (E&H) Smt Sada Bhargavi interacted with all the sevaks deployed for cashew split seva and complemented Smt Neetu for coming all the way from London for rendering Srivari Seva with utmost devotion.

The JEO also said Srivari Seva has been offering score of pilgrims to participate as volunteers and serve the fellow pilgrims from the past over two decades in TTD. “The youth should get inspiration from sevaks like Smt Neetu to participate in Srivari Seva and beget blessings of Sri Venkateswara by offering services with dedication and devotion”, she maintained.

Warehouse DyEO Smt Padmavathi, Marketing GM Sri Subramanyam, DyEO Services Sri Govindarajan, PRO Dr T Ravi and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి సేవకు లండన్ నుండి…
 
– అభినందించిన జెఈఓ శ్రీమతి సదా భార్గవి 
 
 తిరుమల, 2022 అక్టోబరు 22: తోటి భక్తులకు సేవలు అందించేందుకు దేశం నలుమూలల నుండి శ్రీవారి సేవకులు విచ్చేస్తున్న విషయం విదితమే. అయితే విదేశాల నుండి కూడా భక్తులు శ్రీవారి సేవకు రావడం మొదలైంది. లండన్ లో స్థిరపడిన శ్రీమతి నీతు అనే భక్తురాలు కేరళలోని తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి శ్రీవారి సేవకు వచ్చారు. 
 
మొత్తం 11 మంది సభ్యులు ఆన్ లైన్లో బుక్ చేసుకుని సేవకు వచ్చారు. శ్రీమతి నీతు లండన్ లో ఒక ప్రముఖ సంస్థలో అధికారిణిగా పనిచేస్తున్నారు. ఈ బృందం సభ్యులు నాలుగు రోజులపాటు అన్నప్రసాద కేంద్రంలో కూరగాయలు తరగడం, అన్నప్రసాదాలు వడ్డించడం, కళ్యాణకట్టలో క్యూలైన్ల క్రమబద్ధీకరణ, భక్తులకు బ్లేడ్లు అందించడం, అగరబత్తీల విక్రయం తదితర సేవలు అందించారు. శనివారం నాడు శ్రీవారి సేవాసదన్-2లో జీడిపప్పును బద్దలుగా మార్చే సేవలో పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఈ కేంద్రం పరిశీలనకు విచ్చేసిన జెఈఓ శ్రీమతి సదా భార్గవి ఈ సేవకులతో ముచ్చటించారు. శ్రీవారి సేవ చేసేందుకు లండన్ నుంచి వచ్చినందుకు అభినందించారు. మీలాంటి వారు యువతీ యువకులకు స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పారు. యువతీ యువకులు శ్రీవారి సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా జెఈఓ కోరారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.