TTD EO PRESENTS PATTU VASTRAM TO SRISAILAM MALLANA _ శ్రీశైల మల్లన్నకు శ్రీవారి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో
Tirumala, 07 March 2021: TTD EO Dr KS Jawahar Reddy on Sunday evening presented Pattu Vastrams to Sri Braharamba sameta Mallikarjuna Swamy at Srisailam on the occasion of annual Shivaratri Brahmotsavams.
TTD EO along with his spouse made the presentation of Pattu vastrams as part of the tradition to make offerings on behalf of TTD.
The EO couple were received with temple honours by Archakas, Local MLA Sri Shilpa Chakrapani and AEO Sri Haridasu.
Along with EO, Tirumala temple, OSD Sri Pala Sheshadri was present.
Smt Swarnalata Subba Reddy, spouse of TTD Chairman Sri YV Subba Reddy also present.
They had Darshan and were also presented Thirtha Prasadam. They also participated in the evening Mayura Vahana Seva.
TTD TO SUPPORT SRISAILAM TEMPLE DEVELOPMENT: TTD EO
Speaking later the TTD EO said TTD is ready to provide all support for the development of the Srisailam temple. After consultations with temple EO, a plan of action for development activities like repairs to pilgrims rest house will be taken up.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీశైల మల్లన్నకు శ్రీవారి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో
తిరుమల 7 మార్చి 2021: శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి దంపతులు ఆదివారం సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు.
శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులోభాగంగా ఈవో దంపతులు ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఈవో దంపతులకు ఎమ్మెల్యే శ్రీ శిల్ప చక్రపాణి రెడ్డి, ఆలయ ఏఈవో శ్రీ హరిదాసుతో పాటు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పట్టువస్త్రాల సమర్పణ అనంతరం ఈవో దంపతులతో పాటు తిరుమల ఆలయ ఓఎస్డీ శ్రీ పాల శేషాద్రి, టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సతీమణి శ్రీమతి స్వర్ణలత స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి తీర్థ, ప్రసాదాలు అందించారు. రాత్రి జరిగిన మల్లిఖార్జున స్వామి మయూర వాహన సేవలో వీరు పాల్గొన్నారు.
శ్రీశైలం అభివృద్ధికి సంపూర్ణ సహకారం : ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి
శ్రీశైలం ఆలయ అభివృద్ధికి టీటీడీ తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. పట్టువస్త్రాల సమర్పణ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలంలో యాత్రికుల వసతి సముదాయం మరమ్మత్తులు చేయిస్తామన్నారు. ఎమ్మెల్యే, ఆలయ ఈవో తో చర్చించి అభివృద్ధి పనులకు ప్రణాళికలు తయారు చేయిస్తామన్నారు. టీటీడీ తరపున శ్రీశైల మల్లిఖార్జున స్వామికి పట్టువస్త్రాల సమర్పణ ఆనవాయితీగా వస్తోందని ఈవో తెలిపారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.