SILKS PRESENTED TO SRISAILAM _ శ్రీశైల మల్లన్నకు శ్రీవారి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
Tirumala, 04 March 2024: As a part of ongoing Sivaratri Brahmotsavams of Sri Bhramaramba Sametha Mallikarjuna Swamy in Srisailam, TTD EO Sri AV Dharma Reddy presented silk cloths on behalf of Tirumala Sri Venkateswara Swamy on Monday evening.
Srisailam Temple Chairman Sri Reddyvari Chakrapani Reddy, EO Sri Peddiraju and the priests welcomed the TTD officials who reached the temple and arranged them darshan. After that, the temple authorities gave them Tirtha and Prasadams.
Parupattedar Sri Tulsi Prasad and others participated.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
శ్రీశైల మల్లన్నకు శ్రీవారి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2024 మార్చి 04: శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి సోమవారం సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించారు.
శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మారిచ 1న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 11వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.
ఆలయం వద్దకు చేరుకున్న ఈవోకు శ్రీశైలం ఆలయ చైర్మన్ శ్రీ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో శ్రీ పెద్దిరాజు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ అధికారులు వీరికి తీర్థ, ప్రసాదాలు అందించారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ఫార్‌పతేధార్ శ్రీ తులసీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.