LAKSHMI KASULAHARAM SHOBHA YATRA _ వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర

Tirupati, 04 March 2024: Tirumala Srivari Lakshmi kasulaharam Shobhayatra was held on Monday evening with grandeur. 

The procession began with grandeur from the TTD administration building in Tirupati to  Srinivasa Mangapuram.

As part of the Brahmotsavam of Sri Kalyana Venkateswara Swamy, this ornament will be decorated to the Swamy in honour of the Garuda Seva on Monday night.  

Speaking on this occasion, JEO Sri Veerabrahmam said that during the Brahmotsavams Sri Kalyana Venkateswara Swamy is being decorated with the Lakshmikasula Haram. 

This Lakshmiharam Shobhayatra started from the TTD administration building in Tirupati and reached Srinivasa Mangapuram via Sri Kodandaramalayam, Ramachandra Pushkarini, Mahathi Auditorium.  The journey went uproarious with bhajans and kolatams.  

Spl Gr Deputy EO of the temple, Smt Varalaxmi, VGO Sri Balireddy, Superintendent Sri. Chengal Rayalu, other officials and a large number of devotees participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

వైభవంగా శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర

తిరుపతి, 2024 మార్చి 04: తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల‌హారం శోభాయాత్ర సోమ‌వారం వైభవంగా జరిగింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమ‌వారం రాత్రి గరుడ సేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ జేఈవో  శ్రీ వీర‌బ్ర‌హ్మం దంప‌తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, టీటీడీ స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి గరుడసేవనాడు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకెళుతున్నట్టు తెలిపారు. శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు.

ముందుగా శ్రీవారి లక్ష్మీకాసులహారం తిరుమల ఆలయ పేష్కర్ శ్రీ శ్రీహరి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనానికి తీసుకొచ్చారు.

ఈ లక్ష్మీహారం శోభాయాత్ర తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం నుండి ప్రారంభమై
శ్రీ కోదండరామాలయం, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది. భజనలు, కోలాటాలతో కోలాహలంగా యాత్రసాగింది. భక్తులు అడుగడుగునా నీరాజనాలు పలికారు.

ఈ కార్యక్రమంలో ఆలయప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మీ, విజివో శ్రీ బాలిరెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగల్ రాయలు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది