JEO INSPECTS REST HOUSES _ శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాలను ఆకస్మిక తనిఖీ చేసిన జెఈవో
Tirupati, 1 Apr. 21: Tirupati JEO Smt. Sada Bhargavi inspected Srinivasam and Vishnunivasam Rest Houses in Tirupati on Thursday.
She directed the concerned officials to prepare Annaprasadam in a tasty and in a more hygienic manner.
She also verified the pillows, cots, and bed sheets in both the rest houses and enquired with the pilgrims about the facilities.
DyEO Smt Snehalatha was also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాలను ఆకస్మిక తనిఖీ చేసిన జెఈవో
తిరుపతి, 2021, ఏప్రిల్ 01: తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాలను గురువారం టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆన్లైన్లో బుక్ చేసుకుని వస్తున్న యాత్రికులకు గదుల కేటాయింపు విధానాన్ని పరిశీలించారు. ఆ తరువాత గదుల్లోని సౌకర్యాలపై యాత్రికులను అడిగి తెలుసుకున్నారు.
శ్రీనివాసంలోని డార్మెటరీలను పరిశీలించి లాకర్ కేటాయింపు విధానాన్ని మరింత మెరుగుపరచాలన్నారు. యాత్రికులకు మరింత శుచిగా, రుచిగా అన్నప్రసాదాలు అందించాలని సూచించారు. చాపలు, రగ్గులు, దిండ్లను పరిశీలించారు. మరుగుదొడ్లలో పారిశుద్ధ్యం మరింత మెరుగుపరచాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. మాధవంలో ఖాళీగా ఉన్న గదులను పరిశీలించి వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు.
జెఈవో వెంట శ్రీనివాసం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.