ASTOTTARA SATAKUNDATMAKA MAHA YAGAM IN SKVST _ శ్రీనివాసమంగాపురంలో అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగం
Tirupati, 15 Oct. 19: The two day religious fete, Astottara Sata Kundatmaka Srinivasa Maha Yagam will observed at the famous Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram on October 17 and 18 with Ankurarpanam on October 16.
108 ritwiks will perform Homam with utmost devotion in the 108 homa gundams seeking good rains and prosperity.
On Wednesday morning, there will be Viswaksenaradhana, Punyahavachanam, Vastu Homam between 9am and 11am while Ankurarpanam between 4pm and 8pm.
On October 17, Snapana Tirumanjanam will be performed to utsava deities from 9am till 12noon while on October 18 Gaja Puja and Maha Purnahuti will be performed.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
అక్టోబరు 16 నుండి 18వ తేదీ వరకు శ్రీనివాసమంగాపురంలో అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగం
తిరుపతి, 2019 అక్టోబరు 15: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 16 నుండి 18వ తేదీ వరకు అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస మహాయాగం జరుగనుంది. ఇందుకోసం ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 108 హోమగుండాలు ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 108 మంది ప్రముఖ ఋత్వికులు పాల్గొననున్నారు.
ఇందులో భాగంగా అక్టోబరు 16న బుధవారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఆచార్యవరణం, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, వాస్తుహోమం, సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ జరుగనుంది. అక్టోబరు 17న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గో పూజ, శ్రీ భూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్టోబరు 18న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు గజపూజ, పూర్ణాహుతితో మహాయాగం ముగుస్తుంది. ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ఎల్లప్ప ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.