SEPTEMBER QUOTA OF SRIVARI TRUST RELEASED _ శ్రీవాణి ట్రస్టు దాతలకు అందుబాటులో సెప్టెంబరు నెల బ్రేక్ దర్శన టికెట్లు
Tirumala, 25 Aug. 20: TTD has Released Online Quota for Srivani Trust for the month of September with daily numbers ranging to 100.
However, TTD has Cancelled Quota on September 19 in view of Brahmotsava Dwajarohanam and on September 23 as it is Garuda seva.
It may be recalled that TTD has extended one time VIP Break Darshan facility for Srivani trust Donors. The break darshan availing facility for the contributions they have made to the Trust have also been extended from six months to one year in view of Covid-19 restrictions.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవాణి ట్రస్టు దాతలకు అందుబాటులో సెప్టెంబరు నెల బ్రేక్ దర్శన టికెట్లు
తిరుమల, 2020 ఆగస్టు 25: శ్రీవాణి ట్రస్టు దాతల సౌకర్యార్థం 2020 సెప్టెంబరు నెలలో ప్రతి రోజు వంద (100) ఆన్‌లైన్ బ్రేక్ దర్శనం టికెట్ల కోటాను టిటిడి అందుబాటులో ఉంచింది.
ఇందులో భాగంగా దాతలు శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ.10 వేలు ఆన్‌లైన్‌లో లేదా తిరుమలలోని అదనపు ఈవో కార్యాలయంలో కరెంటు బుకింగ్ ద్వారా చెల్లించి ఉదయం బ్రేక్ దర్శనం టికెట్లు పొందవచ్చు.
కాగా సెప్టెంబరు 19న శ్రీవారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం మరియు సెప్టెంబరు 23న గరుడసేవ ఉన్న కారణంగా ఈ రెండు రోజుల పాటు టికెట్లను టిటిడి రద్దు చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దాతల విజ్ఞప్తి మేరకు జూలై 30 నుండి శ్రీవాణి ట్రస్టు ద్వారా రూ. 10 వేలు చెల్లించి టికెట్లు పొందిన దాతల దర్శన కాలాన్ని ప్రస్తుతం ఉన్న 6 నెలల కాల పరిమితిని సంవత్సరానికి టిటిడి పెంచిన విషయం విదితమే.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.