VISAKHA SEER OFFERS PRAYERS IN SRI TT _ శ్రీవారిని దర్శించుకున్న విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామి
Tirumala, 8 Nov. 20: The Pontiff of Visakha Sarada Peetham, HH Sri Swaroopanandendra Saraswati Swami accompanied by Junior Pontiff Sri Swatmanandendra Saraswathi Swami offered prayers in the temple of Lord Venkateswara at Tirumala on Sunday.
Following the temple tradition, first he offered prayers in the temple of Sri Varaha Swamy. Later on his arrival at Mahadwaram, he was welcomed in a traditional manner. TTD Trust Board Chairman Sri YV Subba Reddy, TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy were also present.
After Darshan speaking to media outside the temple he said, the various Parayanam programmes by TTD are a boon to the entire mankind when the entire humanity is fighting dreadful Corona.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామి
తిరుమల, 08, నవంబరు 2020: విశాఖలోని శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామి, పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహస్వామివారి దర్శనం చేసుకున్నారు.
ఆ తరువాత శ్రీవారి ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న స్వామీజీలకు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం ఆలయం వెలుపల శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్రస్వామి మీడియాతో మాట్లాడుతూ మానవాళిని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని త్వరగా దూరం చేయాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ పరిస్థితుల్లో తిరుమలలో సుందరకాండ పారాయణం, సాక్షాత్తు మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు ఉపదేశించిన భగవద్గీత పారాయణం, శ్రీకృష్ణుడు నడిపించిన మహాభారతం పారాయణం చేయడం ఎంతో పుణ్యఫలమన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.