ONLINE KALYANOTSAVAM GETS HUGE RESPONSE _ శ్రీ‌వారి ఆన్‌లైన్ క‌ల్యాణోత్స‌వానికి విశేష స్పంద‌న‌

Tirumala, 9 Sep. 20: The on-line Srivari Nitya Kalyanotsava Seva organised by TTD which was launched on August 7 in view of pandemic COVID-19 restrictions, has been garnering a huge response from pilgrims.

About 8330 devotees had booked this arjita seva online in the last one month while the highest bookings recorded so far on a single day is on August 15 which stood at 1012. TTD sends prasadam which includes uttarium, blouse, akshintalu and sugar candy packet to the address of the devotee couple participants by India post.

TTD has now provided an option to devotee couple who booked Kalyanotsava Seva in online to avail darshan coming to Tirumala within 90 days from the date of their booking. They will be provided darshan alone through Supatham entry.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి ఆన్‌లైన్ క‌ల్యాణోత్స‌వానికి విశేష స్పంద‌న‌

తిరుమల, 2020 సెప్టెంబ‌రు 09: తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో ఆన్‌లైన్ క‌ల్యాణోత్స‌వ సేవకు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. క‌రోనా వ్యాధి వ్యాప్తి నేప‌థ్యంలో భ‌క్తులు నేరుగా క‌ల్యాణోత్స‌వంలో పాల్గొనే అవ‌కాశం లేక‌పోవ‌డంతో భ‌క్తుల కోరిక మేర‌కు ఆగ‌స్టు 7న ఈ సేవ‌ను టిటిడి ప్రారంభించింది. అప్ప‌టినుండి సెప్టెంబ‌రు 7వ తేదీ వ‌ర‌కు నెల‌ రోజుల్లో 8,330 టికెట్ల‌ను భ‌క్తులు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారు. ఆగ‌స్టు 15వ తేదీన అత్య‌ధికంగా 1,012 టికెట్ల‌ను భ‌క్తులు బుక్ చేసుకుని ఆన్‌లైన్ సేవ‌లో పాల్గొన్నారు. ఈ సేవ‌లో పాల్గొన్న గృహ‌స్తులకు ఉత్త‌రీయం, ర‌విక‌, అక్షింత‌లు, క‌ల‌కండ‌ ప్ర‌సాదాన్ని త‌పాలా శాఖ ద్వారా వారి చిరునామాకు టిటిడి పంపుతోంది.

కాగా, ఆన్‌లైన్ క‌ల్యాణోత్స‌వంలో పాల్గొనే ‌గృహ‌స్తులు(ఇద్ద‌రు) టికెట్ బుక్ చేసుకున్న తేదీ నుండి 90 రోజుల్లోపు శ్రీ‌వారిని ద‌ర్శించుకునే అవ‌కాశాన్ని టిటిడి క‌ల్పించింది. వీరికి సుప‌థం ప్ర‌వేశ‌మార్గం ద్వారా ఉచితంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. ఈ అవ‌కాశాన్ని ఆన్‌లైన్ క‌ల్యాణోత్స‌వంలో పాల్గొన్న‌ గృహ‌స్తులు వినియోగించుకోవాల‌ని టిటిడి కోరుతోంది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.