ONLINE MARCH QUOTA OF TTD VIRTUAL ARJITA SEVA TICKETS RELEASED _ శ్రీవారి ఆర్జిత సేవల ఆన్‌లైన్ టికెట్ల కోటా విడుదల
Tirumala, 25 Feb. 21: TTD has released the March quota of virtual Arjita Sevas on Thursday morning at 11.00 am.
The devotees with the tickets for arjita sevas- Srivari Kalyanotsavam, Unjal Seva, arjita Brahmotsavam, Sahasra Deepalankara sevas- should participate in the events virtually from their homes by watching the live telecast on the SVBC channel on the appointed day.
Devotees are requested to book in advance for the virtual arjita sevas and that one couple with a Srivari Kalyanotsava ticket can avail Srivari Darshan freely with a special entry queue (₹300) within 90 days.
However, the Srivari Kalyanotsavam virtual ticket holders should intimate their date of choice for Srivari Darshan free tickets before March 31. Similarly, the ticket holders for other virtual arjita sevas -Unjal Seva, arjita Brahmotsavam and sahasra Deepalankara sevas- should also intimate their choice dates for free Srivari Darshan tickets.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారి ఆర్జిత సేవల ఆన్‌లైన్ టికెట్ల కోటా విడుదల
తిరుమల, 2021 ఫిబ్రవరి 25: మార్చి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల ఆన్‌లైన్ (వర్చువల్) టికెట్ల కోటాను గురువారం ఉదయం 11 గంటలకు టిటిడి విడుదల చేసింది. ఈ సేవా టికెట్లు పొందిన భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తమ ఇళ్ల నుండే వర్చువల్ విధానంలో ఈ సేవల్లో పాల్గొనాల్సి ఉంటుంది.
భక్తులు ఈ విషయాన్ని గమనించి ముందస్తుగా ఈ సేవల టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది. కాగా, కల్యాణోత్సవం టికెట్లు పొందిన గృహస్తులకు(ఇద్దరికి) ఆ టికెట్‌పై ఉచితంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పిస్తారు. అయితే, కల్యాణోత్సవం టికెట్ పొందిన భక్తులు మార్చి 31లోపు తమకు సౌకర్యవంతమైన తేదీనాడు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
అదేవిధంగా, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల ఆన్‌లైన్ టికెట్లు పొందిన భక్తులు మార్చి 31లోపు తమకు సౌకర్యవంతమైన తేదీనాడు రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్‌ను ఆన్‌లైన్ ద్వారా రుసుము చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.