DARSHAN IN TIRUMALA TEMPLE RECOMMENCES AFTER 15H _ శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం ప్రారంభం
Tirumala, 26 Dec. 19: After the famous Hill shrine of Tirumala temple is being closed for 13 hours following Solar Eclipse on Thursday, the darshan to pilgrims recommenced at 2pm. Additional EO Sri AV Dharma Reddy was present during the re-opening of temple doors.
As a practise, the temple doors were closed on Wednesday night at 11pm and reopened on Thursday at 12noon. After performing Grahana Suddhi and other Dhanurmasa rituals, the pilgrims were allowed for darshan after 2pm. The pilgrims were allowed to enter the compartments of Vaikuntham queue complex from 12noon onwards.
On the other hand, the Annaprasadam activity commenced at Matrusri Tarigonda Vengamamba Annaprasadam Complex (MTVAC) from 2:30pm onwards. The milk distribution for children waiting in compartments began from 1pm itself.
TTD has cancelled VIP Break darshan including Protocol, Slotted Sarva Darshan (free darshan with time alot tokens), Divya Darshan(footpath) on Thursday owing to eclipse.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం ప్రారంభం
ముగిసిన సూర్యగ్రహణం
మధ్యాహ్నం నుండి యధావిధిగా అన్నప్రసాద వితరణ
తిరుమల, 2019 డిసెంబరు 26: శ్రీవారి ఆలయంలో గురువారం మధ్యాహ్నం 2 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. సూర్యగ్రహణం కారణంగా బుధవారం రాత్రి 11 గంటల నుండి దాదాపు 13 గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంచారు.
గురువారం ఉదయం 8.08 గంటలకు ప్రారంభమైన సూర్యగ్రహణం ఉదయం 11.16 గంటలకు ముగిసింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ తలుపులు తెరిచారు. ఈ సందర్భంగా తిరుప్పావై, ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, ధనుర్మాస కైంకర్యాలు, ఇతర నిత్య కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది.
అన్నప్రసాద వితరణ ప్రారంభం
సూర్యగ్రహణం కారణంగా బుధవారం రాత్రి 11 గంటలకు మూసివేసిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్సును గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తెరిచారు. వంటశాల శుద్ధి అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుండి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది.
టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, విఎస్‌వో శ్రీ మనోహర్, శ్రీవారి ఆలయ ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.