DARSI MLA SRI VENUGOPAL DONATES 25 GIR BREED COWS _ శ్రీ‌వారి నైవేద్యం ప్ర‌సాదాల త‌యారీకి దేశీయ గోవులను విరాళంగా ఇవ్వండి భ‌క్తుల‌కు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి పిలుపు

– TTD CHAIRMAN APPEALS FOR DONATION OF DESI GHEE FOR NAVNEET SEVA

 Tirupati, 11 August 2021: TTD chairman Sri YV Subba Reddy has appealed to devotees for a donation of desi cows to meet the Naivedyam ghee requirements of the Srivari temple.

Speaking at a meeting in SV Goshala in which the Darsi MLA Sri Venugopal donatesd25 Gir breed cows along with 13 calf’s, the TTD chairman said, the donations will support the TTD commitment to promote Srivari Naivedyam made from organic products and desi ghee. TTD EO Dr KS Jawahar Reddy also participated.

‌He said TTD needed another 500 desi cows to meet the daily demand of 30 kgs of desi ghee for Srivari kainkaryas.

The TTD had drawn up an action plan to offer ghee from seven breeds of desi cows: Gir, Red Sindhi, Haryana, Ongole, Punganur etc.

As part of the same the Darsi MLA Sri M Venugopal had donated 25 Gir cows, 13 calves on Wednesday to TTD in cooperation with former TTD board member Sri Shivkumar, the chairman said.

He said earlier Sri Venugopal had offered to donate 108 cows for the Gudiko-Gomata program.

NAVNEETA SEVA LAUNCH FROM AUGUST 30

The chairman said, TTD shall launch the new program-Navneeta Seva- of offering butter made from milk of desi Cows to Sri Venkateswara Swami from August 30.The unique project will be stabilized in the next 3-4 months.

DONATE DESI GHEE FOR DEEPARADHANA

The chairman also appealed to devotees to donate desi ghee in large Quantities for use in daily Diparadhana seva at Srivari temple. Special counters shall be opened to receive desi ghee from devotees near the temple in Tirumala.

SRIVARI AGARBATTI’s FOR SALE FROM SEPTEMBER 1ST WEEK

The chairman said the sale of Agarbatti made from used flower garlands of all TTD temples will commence from September 1st week instead of August 15 in view of delay in arrival of Agarbatti making machines.

Earlier the chairman accompanied by the TTD Executive Officer inspected the Agarbatti making plant at Tirupati Goshala and enquired about the process of making the incense sticks.

SV Veterinary University Vice-Chancellor Acharya Padmanabha Reddy, Government Whip and Chandragiri MLA Dr Chevireddy and Bhaskar Reddy, Darsi MLA Sri M Venugopal, Additional EO Sri AV Dharma Reddy, SV Goshala Director Dr Harnath Reddy, VGO Sri Manohar, and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి నైవేద్యం ప్ర‌సాదాల త‌యారీకి దేశీయ గోవులను విరాళంగా ఇవ్వండి

భ‌క్తుల‌కు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి పిలుపు

టిటిడికి 25 గిర్ జాతి గోవులను విరాళంగా అందించిన ద‌ర్శి ఎమ్మెల్యే శ్రీ వేణుగోపాల్‌

తిరుప‌తి, 2021 ఆగ‌స్టు 11: తిరుమ‌ల శ్రీ‌వారికి గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించిన ప‌దార్థాలైన బియ్యం, పప్పుదినుసుల‌తోపాటు దేశీయ నెయ్యితో ప్ర‌సాదాలు త‌యారుచేసి నైవేద్యంగా స‌మ‌ర్పిస్తున్నామ‌ని, ఈ విధానాన్ని శాశ్వ‌తంగా కొన‌సాగించేందుకు దేశీయ గోవుల‌ను విరాళంగా అందించాల‌ని టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి భ‌క్తుల‌కు పిలుపునిచ్చారు. ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి ఎమ్మెల్యే శ్రీ మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ బుధ‌వారం టిటిడికి 25 గిర్ జాతి గోవులు, 13 దూడ‌ల‌ను విరాళంగా అంద‌జేశారు. తిరుప‌తిలోని ఎస్వీ గోశాల‌లో బుధ‌వారం జ‌రిగిన  ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఛైర్మ‌న్‌తోపాటు ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ శ్రీ‌వారి నైవేద్యానికి రోజుకు 30 కిలోల నెయ్యి అవ‌స‌ర‌మ‌వుతుంద‌ని, ఇందుకోసం టిటిడి ఉన్న గోవుల‌తోపాటు మ‌రో 500 దేశీయ గోవులు అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని తెలిపారు. ఏడుకొండ‌ల‌స్వామికి సూచిక‌గా గిర్‌, రెడ్ సింథీ, హ‌ర్యానా, ఒంగోలు, పుంగ‌నూరు త‌దిత‌ర ఏడు దేశీయ గోజాతుల నుండి నెయ్యి త‌యారుచేయాల‌ని ప్ర‌ణాళిక రూపొందించామ‌న్నారు. ఇందులో భాగంగా ద‌ర్శి ఎమ్మెల్యే శ్రీ మ‌ద్దిశెట్టి వేణుగోపాల్ 25 గిర్ జాతి గోవులు, 13 దూడ‌ల‌ను విరాళంగా అందించార‌ని, ఇందుకోసం టిటిడి ట్ర‌స్టుబోర్టు మాజీ స‌భ్యులు శ్రీ శివ‌కుమార్ స‌హ‌కారం అందించార‌ని వివ‌రించారు. గ‌తంలో గుడికో గోమాత కార్య‌క్ర‌మానికి 108 గోవుల‌ను విరాళంగా అందించేందుకు శ్రీ వేణుగోపాల్ ముందుకొచ్చార‌ని తెలిపారు.

కృష్ణాష్ట‌మి నుండి న‌వ‌నీత సేవ‌

దేశీయ గోవుల నుండి సేక‌రించిన పాల నుంచి పెరుగు త‌యారుచేసి, దాన్ని చిలికి వెన్న‌ను త‌యారుచేసి, స్వామివారికి స‌మ‌ర్పించేందుకు ఆగ‌స్టు 30న కృష్ణాష్ట‌మి నుంచి ప్ర‌యోగాత్మ‌కంగా న‌వ‌నీత సేవ‌ను  ప్రారంభిస్తామ‌ని ఛైర్మ‌న్ తెలిపారు. రాబోవు 3 – 4 నెల‌ల్లో ఈ సేవ‌ను పూర్తిస్థాయిలో నిర్వ‌హిస్తామ‌న్నారు.

దీపారాధ‌న కోసం భ‌క్తుల నుండి దేశీయ నెయ్యి విరాళం స్వీక‌ర‌ణ‌

శ్రీ‌వారి ఆల‌యంలో నిత్యం దీపారాధ‌న కోసం దేశీయ నెయ్యి విరాళాల‌ను భ‌క్తుల నుండి స్వీక‌రిస్తామ‌ని ఛైర్మ‌న్ తెలిపారు. ఇందుకోసం ఆల‌యం వ‌ద్ద ప్ర‌త్యేకంగా కౌంట‌ర్లు ఏర్పాటుచేస్తామ‌ని, భ‌క్తులు దేశీయ గోవుల నుండి ఉత్ప‌త్తి చేసిన నెయ్యిని విరాళంగా అందించి స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోరారు.

సెప్టెంబ‌రు మొద‌టివారంలో భ‌క్తుల‌కు అందుబాటులోకి అగ‌ర‌బ‌త్తీలు

టిటిడి ఆల‌యాల్లో వినియోగించిన పుష్పాల‌తో అగ‌ర‌బ‌త్తీలు త‌యారు చేస్తున్నామ‌ని, సెప్టెంబ‌రు మొద‌టి వారంలో వీటిని భ‌క్తుల‌కు విక్ర‌యానికి అందుబాటులో ఉంచుతామ‌ని ఛైర్మ‌న్ తెలిపారు. మొద‌ట ఆగ‌స్టు 15న భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచాల‌ని ప్ర‌య‌త్నించామ‌ని, యంత్రాలు రావ‌డం ఆల‌స్య‌మైంద‌ని చెప్పారు. అంత‌కుముందు ఈవోతో క‌లిసి గోశాల‌లోని అగ‌ర‌బ‌త్తీల త‌యారీ ప్లాంట్‌ను ప‌రిశీలించారు. అక్క‌డ యంత్రాల‌ను ప‌రిశీలించి త‌యారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ విప్‌, చంద్ర‌గిరి ఎమ్మెల్యే డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, ద‌ర్శి ఎమ్మెల్యే శ్రీ వేణుగోపాల్‌, టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఎస్వీ ప‌శువైద్య విశ్వవిద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య ప‌ద్మ‌నాభ‌రెడ్డి, ఎస్వీ గోశాల డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.