శ్రీవారి పాదాలమండపంలోని ఆలయాలలో శాస్త్రోక్తంగా ”బాలాలయం”
శ్రీవారి పాదాలమండపంలోని ఆలయాలలో శాస్త్రోక్తంగా ”బాలాలయం”
తిరుపతి, 2020 ఫిబ్రవరి 25: తిరుపతిలోని అలిపిరి వద్దగల శ్రీవారి పాదాల మండపంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయం, శ్రీ పెరియాళ్వార్ ఆలయం, శ్రీ భక్తాంజనేయస్వామివారి ఆలయాలలో బాలాలయం పనులు మంగళవారం ఆగమోక్తంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా మంగళవారం ఉదయం అగ్నిప్రణయణం, చిత్రపటాలకు కుంభారాధన, అకల్మషహోమం, లఘుపూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం మహాశాంతి పూర్ణాహుతి, బాలాలయ చిత్రపటాలకు మహాశాంతిప్రోక్షణ నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 26న ఉదయం 7.30 గంటలకు పుణ్యాహవచనం, ఉదయం 10.27 నుండి 10.59 గంటల నడుమ ఫాల్గుణ శుద్ధ తదియ మేష లగ్నంలో బాలాలయ చిత్రపటాలకు కుంభ ఆవాహన చేపడతారు. మధ్యాహ్నం 11.30 గంటల నుండి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈఓ శ్రీ రవికుమార్‌రెడ్డి, టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ ఎన్ఎకె.సుందరవరదన్, పాదాల మండపం ఆలయాల ప్రధానార్చకులు శ్రీ మురళీకృష్ణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.