GRAND CONCLUSION OF CHANDI YAGAM AT SRI KAPILESWARA SWAMY TEMPLE _ శ్రీ‌ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా ముగిసిన చండీయాగం

Tirupati, 13 Nov. 19: The Chandi yagam conducted at the TTD local temple of Sri Kapileswara Temple, as part of the month long event of Homa Mahotsavam concluded on Wednesday.

As part of the grand valedictory Chandi Homa Samapti, Mahapurnahuti, Kalasha Udwasana, Mahabisekam, Kalasabisekam were performed in the morning and will be followed by japam, homam and nivedana events in the evening.

The TTD also plans to perform the Rudra yagam on November 14 at Sri Kapileswara temple and interested couple could participate with a ticket of Rs.500 and beget blessings, one uttarium, and blouse and anna prasadam.
 

DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati, Temple inspector Sri Reddy Sekhar other archakas and devotees participated in the event.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా ముగిసిన చండీయాగం

తిరుపతి, 2019 నవంబరు 13: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం (చండీయాగం)  బుధవారం వైభవంగా ముగిసింది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా  నవంబరు 5 నుంచి 13వ తేదీ వరకు చండీయాగం నిర్వహించారు.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు చండీహోమం సమాప్తి, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాభిషేకం, కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి కలశస్థాపన, పూజ, జపం, హోమం, నివేదన, హారతి జ‌రుగ‌నుంది.

నవంబరు 14 నుంచి రుద్రయాగం :  

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 14 నుంచి 24వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రయాగం) జరుగనుంది.  

గృహస్తులు రూ.500/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.