RUDRA YAGAM BEGINS IN KT _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో రుద్రయాగం ప్రారంభం
Tirupati, 14 Nov. 19: The ceremonious Rudra Yagam has commenced in Sri Kapileswara Swamy temple in Tirupati on Thursday.
As a part of the month long homa mahotsavams in the holy month of Karthika, Rudra Yagam will be observed for 11days till November 24.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో రుద్రయాగం ప్రారంభం
తిరుపతి, 2019 నవంబరు 14: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రయాగం) గురువారం ఘనంగా ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరుగుతున్నహోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 14 నుంచి 24వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, రుద్రజపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్రత్రిశతి, బిల్వార్చన, నివేదన, విశేషదీపారాధన, హారతి ఇస్తారు.
గృహస్తులు రూ.500/- టికెట్ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.