CHANDI YAGAM ENDS AT SRI KT _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన చండీయాగం

Tirupati, 21 November 2021:  The four day long Sri Kamakshi ammavari (Chandi) Homam organised by the TTD as part of ongoing Homa Mahotsavam at Sri Kapileswara Swamy Temple from November 13-21 concluded on Sunday morning.

 

In this connection rituals of Maha Purnahuti, Kalasha Udwasana, Maha Abhisekam and Kalashabhisekam were performed at the yagashala of the temple from morning 08-12.00 noon. Thereafter in the evening Sri Kapileswara Swamy kalasha Sthapana, Puja Japam, Homam, nivedana and harati were performed.

 

Temple DyEO Sri Subramaniam, Superintendent Sri Bhupathi, temple inspector Sri Reddy Shekar, temple Archakas and other officials were present.

 

RUDRA YAGAM ON NOVEMBER 22

 

TTD is organising Sri Kapileswara Swamy Rudra Yagam at Sri Kapileswara Swamy Temple on November 22.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన చండీయాగం

తిరుపతి, 2021 నవంబరు 21: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం (చండీయాగం) ఆదివారం శాస్త్రోక్తంగా ముగిసింది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 13 నుంచి 21వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం (చండీయాగం) నిర్వహించారు.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు చండీహోమం సమాప్తి, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాభిషేకం, కలశాభిషేకం నిర్వహించారు.

సాయంత్రం శ్రీ కపిలేశ్వరస్వామివారి కలశస్థాపన, పూజ, జపం, హోమం, నివేదన, హారతి నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

నవంబరు 22 నుంచి రుద్రయాగం :

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 22 నుంచి డిసెంబ‌రు 2వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రయాగం) జరుగనుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.