HOMA MAHOTSAVAM ENDS AT SRI KT _ శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన హోమ మహోత్సవాలు

Tirupati, 04 December, 2021:The month-long celebrations of Karthika Homa Mahotsavam at Sri Kapileswara Swamy temple which commenced on November 6, concluded on Saturday with the Sri Chandikeswara Swami Homam and Trishula snanam held in Ekantha due to covid guidelines.

As part of festivities, after Sri Chandikeswara Swami Homam, Maha Purnahuti, Kalasha Udwasana, Maha Shanti abhisekam, Kalashabhisekam, and Trishula snanam and Ankura Visarjanam were performed in the morning.

Later in the evening, Aradhana of Pancha murtis were also observed.

DyEO Sri Subramaniam, superintendent Sri Bhupathi, and temple inspector Sri Reddy Sekhar were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన హోమ మహోత్సవాలు

ఏకాంతంగా త్రిశూల‌స్నానం

తిరుపతి, 2021 డిసెంబ‌రు 04: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా న‌వంబ‌రు 6వ తేదీ నుండి నెల రోజుల పాటు జ‌రిగిన హోమ మహోత్సవాలు శ‌నివారం ముగిశాయి. చివరి రోజు శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం, ఏకాంతంగా త్రిశూల‌స్నానం నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరిగింది. అనంతరం మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మ‌హాశాంతి అభిషేకం, కలశాభిషేకం, ఏకాంతంగా త్రిశూల‌స్నానం, అంకుర విసర్జన నిర్వహించారు.

సాయంత్రం పంచమూర్తులైన శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి, శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీచండికేశ్వరస్వామి వారికి ఆరాధన నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖ‌ర్‌ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.