ANNUAL PAVITROTSAVAMS _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

Srinivasa Mangapuram, 23 Oct. 19: The Ankurarpanam for annual Pavitrotsavams was held at Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram on Wednesday evening. 

The Senadhipathi Utsavam,  Mritsangrahanam and other rituals were held as a part of Beejavapanam. 

Temple DyEO Sri Ellappa,  Superintendent Sri Chengalrayalu,  Temple Inspector Sri Anil and others took part. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
 
తిరుపతి,  2019 అక్టోబర్23: శ్రీనివాసమంగాపురంలో కొలువైన శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో అక్టోబర్ 24 నుండి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలకు బుధవారం సాయంత్రం మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం,  శాస్త్రోక్తంగా అంకురార్పణం నిర్వహించారు.  
 
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
 
పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 24వ తేదీన  రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు పవిత్రప్రతిష్ఠ, రెండవ రోజు అక్టోబరు 25వ తేదీన మధ్యాహ్నం 12.00 నుండి 1.00 గంట వరకు పవిత్ర సమర్పణ నిర్వహించనున్నారు. చివరిరోజైన అక్టోబరు 26వ తేదీ రాత్రి 7.00 నుండి 8.00 గంటల వరకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.  
 
పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 5.00 నుండి 6.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.  
 
గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. పవిత్రోత్సవాల కారణంగా అక్టోబరు 24 నుండి 26వ తేదీ వరకు ఆర్జిత కల్యాణోత్సవం, అష్టోత్తర శత కళశాభిషేకం సేవను టిటిడి రద్దు చేసింది.
     
ఈ సందర్భంగా ప్రతిరోజూ తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథా పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
 
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ యల్లప్ప, ఏఈవో శ్రీ ధనంజయలు, సూపరింటెండెంట్‌ శ్రీ చంగల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ అనిల్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.  
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.