PARUVETA UTSAVAM HELD IN EKANTHAM _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పార్వేట ఉత్సవం
Tirupati, 16 July 2021:The Paruveta Utsavam was held in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram on Friday.
Due to Covid restrictions, this religious event was held in Ekantam.
Temple DyEO Smt Shanti and others were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా పార్వేట ఉత్సవం
తిరుపతి, 2021 జూలై 16: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం స్వామివారి పార్వేట ఉత్సవం జరిగింది. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఆస్థానం నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారిని వేంచేపు చేసి యాదవ హారతి , క్షేమతలిగ, ఆస్థానం, నివేదన నిర్వహించారు. అంతకుముందు ఉదయం 10 నుండి 10.30 గంటల వరకు స్వామివారికి ఆణివార ఆస్థానం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధనంజయుడు, సూపరింటెండెంట్లు శ్రీ రమణయ్య, శ్రీ చెంగల్రాయలు, ఆలయ అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు, ఆర్జితం ఇన్స్పెక్టర్ శ్రీ యోగానందరెడ్డి పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.