PAVITRA SAMARPANA PERFORMED _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
Tirupati, 1 Nov. 21: Pavitra Samarpana was performed as part of the ongoing annual Pavitrotsavams at Srinivasa Mangapuram temple on Monday.
After Snapana Tirumanjanam to Utsavarulu, Pavitramalas are offered to deities.
Temple DyEO Smt Shanti, AEO Sri Dhananjeyulu and other office staffs were also present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
తిరుపతి, 2021 నవంబరు 01: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాల్లో రెండో రోజైన సోమవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాల, అర్చన నిర్వహించారు. యాగశాల వైదిక కార్యక్రమాల అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.
అనంతరం మూలవర్లకు, ఉత్సవర్లకు, గరుడాళ్వార్, విమాన గోపురానికి, పరివార దేవతలకు, ధ్వజస్తంభానికి, శ్రీ ఆంజనేయస్వామివారికి శాస్త్రోక్తంగా పవిత్రాలు సమర్పించారు. తరువాత సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ఆస్థానం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో ధనుంజయులు, సూపరింటెండెంట్లు శ్రీ చెంగల్రాయులు, శ్రీ రమణయ్య, ఆలయ అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.