PAVITRA SAMARPANA HELD AT SRI KRT _ శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర స‌మ‌ర్ప‌ణ‌

Tirupati, 05 August 2021: As a part of the annual Pavitrotsavam festival on the second day, the ritual of Pavitra Samarpana was held in a grand manner at the Sri Kodandarama Swami temple on Thursday morning.

The Utsava idols of Sri Sita Lakshmana Sameta Sri Ramachandramurty were brought to the Yagasala and were offered Snapana Tirumanjanam and Pavitra Samarpana were observed to all family of deities in the temple besides, Dwajasthambam, Dwara Palakas Garudalwar and Homa Mandapams.

Later in the evening, other vedika programs shall be observed at Sri Bashyakarulavari Sannidhi.

Special Grade DyEO Smt Parvati, AEO Sri Durga Raju, Agama Advisor Sri Vedantam Vishnu Bhattacharya, Superintendent Sri Ramesh, Temple Inspectors Sri Jayakumar, Sri Muniratnam were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర స‌మ‌ర్ప‌ణ‌

తిరుపతి, 2021 ఆగ‌స్టు 05: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేసి వేడుక‌గా స్నపనతిరుమంజనం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, బలిమూర్తులకు, విష్వక్సేనులవారికి, ద్వారపాలకులకు, భాష్యకార్లకు, గరుడాళ్వార్‌కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, ఆలయం ఎదురుగా గల ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు.

సాయంత్రం శ్రీ భాష్య‌కార్ల స‌న్నిధిలో ఆస్థానం అనంత‌రం యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు చేపడతారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వ‌తి, ఏఈవో శ్రీ దుర్గ‌రాజు, ఆగ‌మస‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ జ‌య‌కుమార్‌, శ్రీ మునిర‌త్నం పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.