PATRA PUSHPA YAGAM HELD AT SRI KT _ శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా పత్ర పుష్పయాగం
Tirupati, 26 May 2021: As part of Vaishaka Pournami festivities, TTD has organised Patra Pushpa Yagam on Wednesday morning at Sri Kapileswara Swamy Temple in Ekantam due to Covid guidelines.
In this connection, Navakalasha Snapana Tirumanjanam was performed for utsava idols of Sri Kapileswara and Sri Kamakshi Devi after daily rituals in the morning.
Thereafter between 10am and 12 noon Patra and Pushpa Yaga mahotsavam with a variety of leaves and flowers was conducted to Utsava idols
The special celebrations were held by the TTD for the well-being of humanity to ward off ill impact, if any ritualistic lapses in the holy shrine, says Archakas.
DyEO Sri Subramaniam, Superintendent Sri Bhupathi, Temple Inspector Sri Sekhar, Archakas and other staffs were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా పత్ర పుష్పయాగం
తిరుపతి, 2021 మే 26: తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా పత్ర పుష్పయాగం బుధవారం శాస్త్రోక్తంగా జరిగింది. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 8 నుండి 10 గంటల వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీ కామక్షి అమ్మవారి ఉత్సవర్లకు నవ కలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పంచామృతాభిషేకం, చెరుకు రసం, కొబ్బరినీళ్ళు, విబూది, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.
ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పత్ర పుష్పయాగ మహోత్సవం జరిగింది. ఇందులో చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, జాజి, రోజా, తామర, మల్లి, వృక్షి, కనకాంబరంలతో పాటు బిల్వ పత్రం, తులసి, పన్నీరు ఆకులతో స్వామి, అమ్మవార్లకు పత్ర పుష్ప యాగ మహోత్సవం నిర్వహించారు.
లోక క్షేమం కొరకు, ఆలయంలో అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పత్ర పుష్పయాగం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.