PEAKS AT SUNDARAKANDA AKHANDA PATHANAM _ భక్తిభావాన్ని పంచిన సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం

Tirumala, 26 May 2021The Nada Neeranjanam platform reverberated with the recitation of 167 shlokas from 58 sargas of Akhanda Sundarakanda on Wednesday morning held in adherence to Covid guidelines seeking the health safety of humanity.

Speaking on the occasion Sri Govindananda Saraswati Swami of Hampi said He was blessed to participate in the Sundarakanda Pathanam at Tirumala.

Sri KSS Avadhani, Principal of Dharmagiri Veda Vijnana peetham said the parayana mahotsavam organised by TTD at Tirumala for the betterment of humanity had conducted, completed 412 days in all including 350 days of Sundarakanda Pathanam on May 26.

He said in the 14th edition of Akhanda Pathanam 167 shlokas were chanted by Veda pundits Sri PVLN Maruti, Sri M Pavan Kumar Sharma under supervision of Sri KSS Avadhani. 

Devotees across the world participated in the Pathanam Mahotsavam from their homes by watching the live telecast on SVBC between 7am and 9am.

TTD Additional EO Sri AV Dharma Reddy Vice-Chancellor of National Sanskrit University Acharya Muralidhar Sharma, Dharmagiri Veda Vignana Peetham faculty members, Veda pundits and officials were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తిభావాన్ని పంచిన సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం

తిరుమల, 2021 మే 26: ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై బుధవారం ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు సుందరకాండలోని 58వ సర్గలో గ‌ల 167 శ్లోకాలను వేద పండితులు అఖండ పారాయ‌ణం చేశారు. కోవిడ్ – 19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ పారాయ‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

ఈ పారాయణంలో పాల్గొన్న హంపీ క్షేత్రానికి చెందిన శ్రీ గోవిందానంద స‌ర‌స్వ‌తి స్వామీజీ మాట్లాడుతూ తిరుమల క్షేత్రంలో జరుగుతున్న సుందరకాండ పారాయణంలో పాల్గొనడం పూర్వజన్మ పుణ్యఫలమన్నారు. ఈ పారాయణం రామభక్తుడైన హనుమంతునికి ఎంతో ప్రీతికరమని, ఆంజనేయుని శరణు వేడితే సకల కష్టాలు దూరమవుతాయని చెప్పారు. హనుమంతుడు చిరంజీవిగా ఉండి వర్తమాన కాలంతోపాటు భవిష్యత్ కాలంలోనూ శాంతి సౌఖ్యాలను ప్రసాదిస్తారని తెలిపారు.

తిరుమ‌ల‌ ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివ‌సుబ్ర‌మ‌ణ్య అవధాని మాట్లాడుతూ లోక క‌ల్యాణార్థం టిటిడి నిర్వ‌హిస్తున్న పారాయణ యజ్ఞంలో భాగంగా, మంత్ర పారాయణం ప్రారంభించి 412 రోజులు పూర్తికాగా, మే 26వ తేదీకి సుందరకాండ పారాయ‌ణం 350 రోజులు పూర్తి చేసుకుందని వివ‌రించారు.

14వ‌ విడ‌త‌ అఖండ పారాయ‌ణంలోని 167 శ్లోకాలను ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్ అవధాని పర్యవేక్షణలో శ్రీ పివిఎన్ఎన్.మారుతి‌, శ్రీ ఎం. పవనకుమార శర్మ పారాయ‌ణం చేశారు. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఏ.వి. ధర్మారెడ్డి దంప‌తులు, తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య మురళీధర శర్మ, ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల అధ్యాప‌కులు, పండితులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.