శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏకాంతంగా చ‌క్ర‌స్నానం

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏకాంతంగా చ‌క్ర‌స్నానం

తిరుప‌తి, 14 జ‌న‌వ‌రి 2021: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురు‌వారం మకర సంక్రాంతి సంద‌ర్భంగా  ఆల‌యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉద‌యం తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి ధ‌నుర్మాస కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఆ త‌రువాత స‌హ‌స్ర‌నామార్చ‌న చేప‌ట్టారు. అనంత‌రం ఉదయం 9.30 నుండి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీ చక్రత్తాళ్వార్‌కు ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో ఏకాంతంగా చక్రస్నానం నిర్వహించారు.

కాగా సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని ఆలయంలోని విమాన ప్రాకారంలో ఊరేగించి ఆస్థానం చేపడతారు.

జనవరి 15న గోదా ప‌రిణ‌యోత్స‌వం

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 15వ తేదీ గోదా పరిణయోత్సవం నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం 3 గంట‌ల‌కు శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యం నుండి మేల్‌ఛాట్ వ‌స్త్రం, పూల‌మాల ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీ ఆండాళ్ అమ్మ‌వారికి స‌మ‌ర్పిస్తారు. అనంత‌రం అమ్మ‌వారికి స‌మ‌ర్పించిన మేల్‌ఛాట్ వ‌స్త్రం, పూల‌మాలల‌ను తిరుమ‌ల శ్రీ‌వారికి స‌మ‌ర్పిస్తారు. సాయంత్రం 4 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ఆల‌యంలోని శ్రీ పుండ‌రీక‌వ‌ళ్లి అమ్మ‌వారి ఆల‌యంలో వ‌ద్ద గోదా ప‌రిణ‌యోత్స‌వం నిర్వ‌హిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ రవికుమార్ రెడ్డి, ప్రధాన అర్చకులు శ్రీ శ్రీనివాస దీక్షితులు , సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్ కుమార్, శ్రీ వెంక‌టాద్రి,  టెంపుల్ ఇన్సెక్టర్లు‌ శ్రీ కృష్ణమూర్తి, శ్రీ మునీంద్ర‌బాబు తదితరులు పాల్గొన్నారు.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.